భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి26(జనం సాక్షి ): అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో విగ్రహ ఆవిష్కరణలో భాగంగా జరిగిన దాడిని ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. మాపై దాడి చేసేందుకే బయటి వ్యక్తులను ఇక్కడికి రప్పించారు.నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలను వర్గాల పేరుతో విడదీయాలని చూస్తున్నారు. మా కార్యకర్తలపై దాడి చేస్తే ఇకపై ఊరుకునేది లేదు. ప్రత్యర్ధి వర్గం వారు మాపై దాడికి దిగుతూ మాపై అక్రమ కేసులు పెడితే భయపడేది లేదు. పిడమర్తి రవిపై దాడి చేసి గాయపర్చారు. ఈఘటనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
కార్యకర్తలపై దాడిని సహంచేది లేదు: పాయం