చెత్తపన్నుపై మండిపడ్డ సభ్యులు
విశాఖపట్టణం,ఫిబ్రవరి26(జనం సాక్షి): జీవీఎంసీ పాలక వర్గ సమావేశం రసాభాసగా సాగింది. చెత్తపన్నుపై సబ్యులు నిలదీసారను. విశాఖ మేయర్ గోలగని హరి వెంకట కుమారి అధ్యక్షతన సమావేశం శనివారం జరిగింది. సమావేశం వాడి, వేడిగా సాగింది. చెత్త పన్నును, ఆస్తి పన్నును రద్దు చేయాలని ప్రజలపై భారాలు మోపొద్దని సీపీఎం కార్పొరేటర్ డా.బి గంగారావు డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీ, నీటి ప్రాజెక్టులు, అండర్ గ్రౌండ్ పనులు, కాలుష్యంపై చర్చ జరిగింది. 15వ ఆర్ధిక సంఘం నిధులను రూ.1.80కోట్లను కాలుష్యం నివారణకు ఎలక్టిక్ర్ వెహికల్స్ కొనుగోలు చేయాలని కౌన్సిల్ లో తీర్మానంకి పెట్టగా గంగారావు అభ్యంతరం తెలిపారు. విశాఖ పోర్ట్ నుంచి వేదాంత, గంగవరం పోర్ట్ నుంచి వెలువడే కాలుష్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఈ నిధులను వాహనాలు పేర నిధులు దుర్వినియోగం చేయడం తగదని ఆ ఖర్చుకు జరిగిన ప్రతిపాదనను సీపీఎం కార్పొరేటర్ అడ్డుకున్నారు. ఈ అంశాన్ని మేయర్ వాయిదా వేయాల్సి వచ్చింది. మొత్తం అజెండా అంశాల్లో 1 నుంచి 10 వరకూ ఆమోదించారు. 11 నుంచి 15 నుంచి అభ్యంతరాలు రావడంతో అధ్యయనం చేసేందుకు టైం తీసుకున్నారు. షాపుల లీజులపై వైసీపీ సభ్యులు ఆమోదం పెట్టడంతో సీపీఎం, జనసేన సభ్యులు వ్యతిరేకించారు.
వాడీవేడీగా జివిఎంసి పాలకర్గ సమావేశం