కెసిఆర్ అనుకున్నట్లుగా నడుం బిగించేనా
రాజకీయ పార్టీల్లో నమ్మకం కలిగించడమే ముఖ్యం
హైదరాబాద్,ఫిబ్రవరి10(జనంసాక్షి): బిజెపిపై అవిూతువిూకి సిద్దమయిన తెలంగాణ రాష్ట్రపతి అధినేత, సిఎం కెసిఆర్ ప్రత్యామ్నాయరాజకీయాలకు కేంద్ర బిందువు అవుతారా అన్న చర్చసాగుతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా విమర్వల దాడిని పెంచిన సిఎం కెసిఆర్..ఇటీవల ప్రధాని మోడీ పర్యటనను బహిష్కరించారు.
కనీసం ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా వెళ్లలేదు. అలాగే రాజ్యసభలో మోడీ వ్యాక్యలను ఆసరాగా చేసుకుని టిఆర్‌ఎస్ చేపట్టిన ఆందోళనలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే విపక్షాలు కూడా మోడీ తీరుపై మండిపడుతున్నాయి. ఈ క్రమంలో కెసిఆర్ రాజకీయ పునరేకీకరణకు పూనుకుంటారా అందుకు..సిద్దంగా ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది. మోడీ తీరుతో దేశంలో ఆవావహ రాజకీయాలకు అవకాశంఏర్పడిరది. అయితే దానిని పూడ్చే క్రమంలో ఎవరికి వారు పోరాడుతున్నారు. కలసి పోరాడాలన్న సంకల్పం ఉన్నా ఎవరు కూడా పెద్దగా ముందుకు రావడంలేదు. ఇటీవల బడ్జెట్ తరవాత ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వార్షిక బ్జడెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఘాటుగగానే తిట్టిపోశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతానని ప్రకటించారు. పనిలో పనిగా ప్రస్తుత రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావలసిన అవసరం ఉందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ అంతసేపు తిట్టినా, హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న రెండు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు డుమ్మా కొట్టినా
కేసీఆర్ నిజంగానే భారతీయ జనతా పార్టీతో తలపడతారా? అనే సందేహం మాత్రం తొలగిపోవడం లేదు. ఎందుకంటే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒకసారి ఇలాగే విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఢల్లీి వెళ్లి వచ్చి చల్లబడిపోయారు. ఇప్పుడు మళ్లీ జూలు విదిల్చినప్పటికీ ఆయనపై నమ్మకం కుదరడం లేదు. నాలుక మడతేయడం కేసీఆర్‌కు అలవాటే కనుక జాతీయ స్థాయిలో కూడా ఆయన ప్రకటనను ఇతర నాయకులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత కాంగ్రెస్ పుంజుకుందన్న అభిప్రాయం వ్యాపించింది. దీంతో భారతీయ జనతా పార్టీని కేసీఆర్ మళ్లీ టార్గగెట్‌గా ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. కేసీఆర్ మనసులో ఏముందో తెలియకపోయినా బీజేపీ వైఖరి స్పష్టంగా ఉంది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఉన్నారు. ఉత్తరాదిన తిరుగులేని పరిస్థితి ఉన్నా.. దక్షిణాదిలో వారికి పట్టుచిక్కడం లేదు. ఇంతకుముందు దక్షిణాదిన మొదటిసారిగా కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ తమ హయాంలో తెలంగాణలోనైనా అధికారంలోకి రావాలని మోదీ ద్వయం సంకల్పించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో బీజేపీకి ఏ మాత్రం అవకాశం లేదు. ఇక మిగిలింది తెలంగాణనే కనుక ఈ రాష్ట్రంపై వారి దృష్టిపడిరది. తెలంగాణను చేజిక్కించుకోవడం కోసం ఎంతదూరం వెళ్లడానికైనా వారిరువురూ సిద్ధంగా ఉన్నారు. అయితే పరిస్థితులు అనుకూలిస్తున్న వేళ తెలంగాణపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. ఇప్పుడ బిజెపి ఆత్మరక్షణలో పడిరది. అయితే ఎప్పటికప్పుడు మాట మార్చే అలవాటు ఉన్న కేసీఆర్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. కేసీఆర్ ఎంతగా దూషణభూషణలకు పాల్పడినా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచిచూసే ధోరణిలో ఉంటారని కూడా ప్రచారం సాగుతోంది. జూలైలో రాష్ట్రపతి ఎన్నిక కూడా ఉన్నందున అప్పటి వరకు కేసీఆర్ కొంచెం ఆచితూచే ఉంటారని భావిస్తున్నారు. పరిస్థితులు ప్రతికూలంగా మారితే కేసీఆర్ వెంటనే యూ టర్న్ తీసుకునేందుకు కూడా వెనకాడకపోవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ మంచి మెజార్టీతో అధికారంలోకి వస్తే దేశంª`లో రాకీయవ్యూహాలు కూడా మారిపోతాయి. అందుకే బీజేపీపై ఆయన ప్రకటించిన యుద్దం ఎంతవరకు అన్నది కాలక్రమంలో తేలనుంది. ఇప్పటికైతే ప్రతిరోజూ బిజెపిని తిట్టిపోస్తున్నారు. రోజూ ఎండగడుతున్నారు. ఇకపోతే రాజ్జాంగాన్ని మార్చాలన్న కెసిఆర్ వ్యాఖ్యలపై రాజకీయంగగా దుమారం రేగగుతోంది. ఈ విషయంలో అనూహ్యంగా బిజెపి కూడా ఎదురుదాడి చేస్తోంది. నిజానికి అంబేడ్కర్ ఆధ్వర్యంలో
రూపుదిద్దుకున్న రాజ్యాంగాన్ని మార్చేయాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గతంలో బిజెపి నేతలు కూడా చేశారు. ఈ క్రమంలో దళితుల్లో సహజంగానే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నియంతృత్వ పోకడల విషయంలో తెలుగు రాష్టాల్ర ముఖ్యమంత్రులు సరికొత్త నిర్వచనం ఇస్తున్నారు. పూర్వం రాజులు, చక్రవర్తులు వ్యవహరించినట్టుగా కేసీఆర్, జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఏ మంత్రి కూడా కేసీఆర్, జగన్‌ల ముందస్తు అనుమతి లేకుండా తమ శాఖకు సంబంధించిన విషయంలో కూడా నిర్ణయం తీసుకునే ధైర్యం చేయడం లేదు. ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించిన తర్వాత ఏక వ్యక్తి పాలన మొదలైంది. అది ఇప్పుడు కేసీఆర్, జగన్ రూపంలో పరాకాష్ఠకు చేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇదే రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. అంబేడ్కర్ ఆధ్వర్యంలో రూపొందిన రాజ్యాంగం ఇప్పటికే పలుమార్లు సవరణలకు గురైంది. తాము రూపొందించిన రాజ్యాంగానికి సవరణలు చేసే వెసులుబాటును కూడా రాజ్యాంగ నిర్మాతలే కల్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే సర్వాధికారం అనే మౌలిక సూత్రాన్ని విస్మరించి ప్రజలు ఇచ్చిన అధికారంతో నేతలు సర్వభోగాలు అనుభవిస్తున్నారు. మొత్తంగా కేంద్రంలో గగుణాత్మక రాజకీయాలతో
పాటు,రాజ్యాంగంపైనా కెసిఆర్ స్పషట్మైన వైఖరితో ముందుకు సాగితే ప్రజలు కూడా స్వాగతించవచ్చు.