ఎంపి రామ్మోమన్ నాయుడు ఆధ్వర్యంలో ఫిర్యాదు
న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో వ్యవహారంపై ఇంకా రచ్చ కొనసాగు తూనే ఉంది.. ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనిపిస్తోంది? ఘాటు విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి.. ఇప్పటికే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది టీడీపీ.. ఇక, డీజీపీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు.. మరోవైపు.. ఈ వ్యవహారంపై గవర్నర్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక, ఏకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టికి గుడివాడ కేసినో వ్యవహారం వెళ్లింది.. ఈడీకి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దేశ రాజధాని ఢల్లీిలో ఈడీ అధికారులను కలిసిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుడివాడ కేసినో విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. టీడీపీ ఫిర్యాదుతో కేసులు నమోదు చేసే అవకాశం ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇడికి చేరిన గుడివాడ కెసినో వ్యవహారం