ఆరువేలమంది పోలీసులతో క్రమబద్దీకరణ
వివరాలు వెల్లడిరచిన సిపి తరుణ్ జోషివరంగల్,ఫిబ్రవరి8((జనం సాక్షి)): ఆరువేల మంది పోలీసులతో మేడారం జాతరకు తరలివచ్చే వాహనాలను నియంత్రిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోపి తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 19వరకు జరిగే మేడారం సమ్మక్క`సారలమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ జోన్ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మి , లా అండ్ ఆర్డర్ అదనపు డిసిపి సాయి చైతన్యత, సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డిసిపి పుష్ప, అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ తొ కలిసి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విూడియా సమావేశంలో మాట్లాడారు. రెండు ముఖ్యమైన లక్ష్యాలతో పోలీసులు మేడారం జాతర బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇందులో ఒకటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అమ్మవార్ల దర్శించుకోవడంతో పాటు, క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవడం అన్నారు. అలాగే ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాతరను పూర్తిగా విజయవంతం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. వరంగల్ నుంచి తరలివచ్చే ప్రైవేట్ వాహనాలు గుడెప్పాడు, ములుగు, పస్రా, నార్లపూర్‌కు చేరుకొని పోలీసులు సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.