రెండేళ్లుగా 1.7 కోట్ల కేసులు నమోదు
సెల్‌ఫోన్ చోరీలను ఐహాక్‌తో గుర్తించి పట్టుకున్నాం
విూడియా సమావేశంలో సిపి ఆనంద్ వెల్లడి
హైదరాబాద్,ఫిబ్రవరి26(జనం సాక్షి): రెండేళ్లలో ట్రాఫిక్ చలాన్లు పేరుకుపోవటంతో రాయితీ కల్పించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ద్విచక్రవాహనాలు, ఆటోలకు జరిమానాలో 75 శాతం రాయితీ కల్పిస్తామని వివరించారు. 4 చక్రాల వాహనాలకు జరిమానాలో 50శాతం చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఆన్‌లైన్, లోక్ అదాలత్ ద్వారా చెల్లింపు సౌకర్యం ఉంటుందని వెల్లడిరచారు. మార్చి 12వ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. రాయితీ ఇస్తే వాహనదారులు చెల్లించే అవకాశం ఉందని సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. రెండు సంవత్సరాలుగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు వేస్తూ పోతున్నాం. కానీ ప్రజలు కట్టడం లేదు. దీనికి తోడు కోర్టు ప్రొసీడిరగ్స్ కూడా జరగడం లేదు. 1.7 కోట్ల కేసులు నమోదయ్యాయి. వీటి చలాన్ల విలువ సుమారు రూ.500 కోట్లకు పైగానే ఉంటుంది. వీటిని కట్టే పరిస్థితుల్లో లేరు. దీని గురించి మేం జ్యుడీషియరీతో చర్చించాం. దీంతో రాయితీలిచ్చి చలాన్లు కట్టించుకోవాలని నిర్ణయం తీసుకున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. తప్పని తెలిసినా
అనేక మంది ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ.. ప్రమాదాలకు కారణం అవుతున్నారని పోలీసులు విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నాలుగైదేళ్లుగా నమోదైన ప్రమాదాలను అధ్యయనం చేయగా.. రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఇందులో మద్యం మత్తు, అతివేగమే కారణంగా ఉంటోందని తేల్చారు. అందుకోసం రాత్రివేళల్లోనూ పని చేసే అత్యాధునికమైన
స్పీడ్ లేజర్ గన్‌లను త్వరలో తెప్పిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇకపై రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 4 వరకు ట్రాఫిక్ పోలీసులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తారని చెప్పారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ట్యాంక్‌బండ్, మలక్‌పేట, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో వీరిని నియమించనున్నట్లు వెల్లడిరచారు. హాక్ ఐ యాప్ సహాయంతో చోరీకి గురైన ఫోన్లను గుర్తించినట్లు నగర్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నగరంలోని సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడారు. హాక్ అయ్ లాస్ట్ రిపోర్ట్ యాప్ ద్వారా 80 మొబైల్ ఫోన్లను ట్రేస్ అవుట్ చేసి వాటి యజమానులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. బాధితులు ఇటీవలే హాక్ ఐ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని తమ నంబర్లను దానిలో రిజిస్టర్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తమ స్మార్ట్‌ఫోన్లను కోల్పోయిన యూజర్లు అయిన వీరు మొబైల్‌లను హాక్ ఐ లాస్ట్ రిపోర్ట్ అప్లికేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా, ఐటీ సెల్, సీపీ ఆఫీసు, హైదరాబాద్ సిటీ పోలీసులు ఎఓఇఎ నంబర్‌లను ఉపయోగించి పోయిన మొబైల్‌లను ట్రాక్ చేశామన్నారు. పోయిన 80 మొబైల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకుని వారి యజమానులకు సీపీ అప్పగించారు.