న్యూజిలాండ్‌ బౌలర్‌ మాట్‌ హెన్రీ అద్భుతం


తొలి రోజు 7 వికెట్లతో ఆసిస్‌కు చుక్కలు

కైస్ట్ర్‌ చర్చ్‌,ఫిబ్రవరి17  (జనంసాక్షి)  : దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో న్యూజిలాండ్‌ బౌలర్‌ మాట్‌ హెన్రీ అద్భుతంగా రాణించాడు. తొలి రోజు ఆటలో భాగంగా 7 వికెట్లు పడగొట్టి ప్రొటిస్‌ జట్టును కోలుకోకుండా చేశాడు. దీంతో 95 పరుగులకే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌కు తెరపడిరది. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ నిమిత్తం సౌతాఫ్రికా న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 17న కైస్ట్ర్‌చర్చ్‌ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆతిథ్య కివీస్‌కు హెన్రీ శుభారంభం అందించాడు. తొలుత ప్రొటిస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌(1 పరుగు)ను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత మార్కరమ్‌(15), డసెన్‌(8) వంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపాడు. హంజా(25), వెరెనె(18), రబడ(0), స్టర్‌మాన్‌(0) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఓవర్లు వేసిన హెన్రీ... 23 పరుగులు ఇచ్చి మొత్తంగా 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పేసర్‌ హెన్రీకి తోడు జెవిూషన్‌, టిమ్‌ సౌథీ, వాగ్నర్‌ తలా ఓ వికెట్‌ తీయడంతో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 95 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీస్‌కు ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌(15), విల్‌ యంగ్‌(8) శుభారంభం అందించలేకపోయారు. కాన్వే(36), హెన్రీ నికోల్స్‌(37` బ్యాటింగ్‌) రాణించారు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్‌ 116 పరుగులు చేసింది. 21 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నికోల్స్‌, వాగ్నర్‌ క్రీజులో ఉన్నారు.