ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన బిజెపి పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్
హుస్నాబాద్ ఫిబ్రవరి 21 (జనం సాక్షి )
హుస్నాబాద్ పట్టణంలో పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు, అక్రమ నిర్మాణాలు నిర్ములించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.. పట్టణంలో మున్సిపల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమ లేఔట్ పర్మిషన్లు ఇస్తూ, నాలా అనుమతులు ఇస్తూ, దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తూ అక్రమ వెంచర్లు వేసే రియల్టర్లకు వత్తాసు పలుకుతూ మామూళ్ల మత్తులో తుగుతున్నారు.. పేద, మధ్య తరగతి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు భూములను కొనుగోలు చేసి స్వంత ఇంటిని నిర్మించుకోవాలనే కళను చెదరగొడుతున్నారు.పట్టణంలోని ఆరెపల్లె, సబ్ స్టేషన్ ఎదురుగా, మోడల్ స్కూల్ దగ్గర, నాగులమ్మ పంపు,కరీంనగర్ రోడ్డు పలు ప్రాంతాల్లో ఆక్రమ వెంచర్లు వేసి,దొంగ డ్యాకుమెంట్లు సృష్టిస్తూ,ప్రజలచే కొనుగోలు చేయించి, గోల్ మాల్ చేసి, మోసం చేస్తూ రియల్ ఎస్టేట్ దందా మూడు పువ్వులు ఆరుకాయలన్న చందంగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోని అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై విచారణ జరిపి, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమ లేఔట్లు పెట్టి,ప్రజలను మోసం చేస్తున్న రియల్టర్లుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారతీయ జనతా హుస్నాబాద్ పట్టణ శాఖ ఫక్షాన విజ్ఞప్తి చేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో 8 వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ మ్యాదరబోయిన వేణు యాదవ్ 11వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్, జిల్లా కోశాధికారి దొడ్డి శ్రీనివాస్, అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొళ్లపల్లి వీరాచారి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బొనగిరి రవి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బద్దిపడుగ జైపాల్ రెడ్డి, పట్టణ కోశాధికారి అకోజు అరుణ్ కుమార్, బిజేవైయం పట్టణ ఉపాధ్యక్షుడు కాంసాని లక్ష్మణ్, బిజెపి సీనియర్ నాయకులు రాయికుంట చందు, తదితరులు పాల్గొన్నారు..