టీఎస్‌ ఎంసెట్‌`2022 నోటిఫికేషన్‌ విడుదల

 

 



ఏప్రిల్‌ 6 నుంచి మే 28వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్‌,మార్చి 28(జనంసాక్షి):టీఎస్‌ ఎంసెట్‌`2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్‌ కన్వీనర్‌ సూచించారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ. 400, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 800 చెల్లించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి. ఇంజినీరింగ్‌, మెడికల్‌ ప్రవేశ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ. 800, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1600 చెల్లించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి. అగ్రికల్చర్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ను జూన్‌ 14, 15వ తేదీల్లో, ఇంజినీరింగ్‌ ఎగ్జామ్‌ను 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు