all main first page news

 


1.బన్సీలాల్పేట మెట్లబావి పునరుద్ధరణపై ప్రధాని ప్రశంస
హైదరాబాద్‌,మార్చి 27(జనంసాక్షి):దేశంలో జల సంరక్షణ, భూగర్భజలాలు కాపాడేందుకు విశేష కృషి చేస్తున్నారని.. బన్సీలాల్పేట మెట్లబావికి పునర్వైభవం తీసుకురావడాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. సికింద్రాబాద్‌ బన్సీలాల్పేటలోని చారిత్రక మెట్లబావికి పునర్వైభవం తీసుకొచ్చారని, కాలక్రమేణా మట్టి, చెత్తతో నిండిన ఆ బావి నేడు అలనాటి వైభవాన్ని చాటుతోందన్నారు. తమిళనాడుకు చెందిన అరుణ్‌ భూగర్భ జలాల అభివృద్ది కార్యక్రమం చేపట్టారని మోదీ వివరించారు. మహారాష్ట్రలో ఓ పురాతన మెట్లబావిని శుభ్రపరిచారని తెలిపారు. సమాజంలోని వ్యక్తులు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని, వారి సేవలను ప్రధానమంత్రి కొనియాడారు.
భారత ఉత్పత్తులు విశ్వవ్యాప్తం.. ఏడాదిలో రూ.30లక్షల కోట్ల ఎగుమతులు!
స్వదేశీ ఉత్పత్తుల ఎగుమతిని గణనీయంగా పెంచుకుంటున్న భారత్‌.. వాటి ప్రాచుర్యాన్ని విశ్వవ్యాప్తం చేసుకుంటోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ క్రమంలో భారత్‌ నిర్దేశించుకున్న రూ.30 లక్షల కోట్ల (400 బిలియన్‌ డాలర్లు) విలువైన ఎగుమతుల మైలురాయిని చేరుకుందన్నారు. ఇది కేవలం ఆర్థికవ్యవస్థకు చెందిన విషయం మాదిరిగానే కనిపించినప్పటికీ.. భారత శక్తి, సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. ముఖ్యంగా మన దేశ వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోందని దీని అర్థమని ప్రధాని మోదీ వివరించారు. ఈ మేరకు ప్రతినెలా చివరి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ`మార్కెట్‌ ప్లేస్‌ పేరుతో ప్రభుత్వం వివిధ రకాల ఉత్పత్తుల సేకరణలో చిన్న పారిశ్రామికవేత్తలు కీలకంగా మారారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘గతంలో కేవలం పేరున్న వ్యక్తులు మాత్రమే ప్రభుత్వానికి ఉత్పత్తులు అమ్మేవారు. కానీ, ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ`మార్కెట్ప్లేస్‌ (వఓజీతీసవబిజూశ్రీజీఞవ) పోర్టల్‌ అందుబాటులోకి రావడంతో ఈ విధానం పూర్తిగా మారిపోయింది. ఏడాది కాలంలోనే వీరి నుంచి రూ.లక్షకోట్ల ఉత్పత్తును ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇదే నూతన భారత్‌ స్ఫూర్తి’ అంటూ ప్రధాని మోదీ వివరించారు.
ఇక భారతీయ ఉత్పత్తుల సామర్థ్యాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ.. అందుకు దేశంలోని రైతులు, చేతివృత్తులు, చేనేత కార్మికులు, ఇంజినీర్లతోపాటు ఎంఎస్‌ఎమ్‌ఈ రంగంలోని చిన్న పారిశ్రామికవేత్తలే కీలకమన్నారు. వారి కృషి వల్లే రూ.30లక్షల కోట్ల (400 బిలియన్‌ డాలర్లు) విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసే లక్ష్యాన్ని భారత్‌ సాధించిందన్నారు. ఇలా భారత ప్రజల శక్తి, సామర్థ్యాలు విశ్వవ్యాప్తం కావడం తనకెంతో గర్వంగా ఉందని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇలా ప్రతి ఒక్క భారతీయుడు స్థానిక గళం (లోకల్‌ ఉత్పత్తులకు ప్రాధాన్యం) విప్పితే.. ఇదే లోకల్‌, గ్లోబల్గా మారడానికి ఎంతో సమయం పట్టదన్నారు. తద్వారా భారత ఉత్పత్తుల విలువను మరింత ఇనుమడిరపజేయవచ్చని ప్రధాని మోదీ సూచించారు.ఇదిలా ఉంటే, 2018`19 సంవత్సరానికి గాను దేశీయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 330 బిలియన్‌ డాలర్లతో రికార్డు సాధించింది. తాజాగా దీనిని అధిగమిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ 400 బిలియన్‌ డాలర్ల మార్కును దాటింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా భారత ఉత్పత్తులు ఈ స్థాయిలో ఎగుమతి కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

2.హైదరాబాద్‌కు పెట్టుబడుల వెల్లువ
` ఫార్మారంగంలో భారీ విస్తరణకు స్లేబ్యాక్‌ ఫార్మా కంపెనీ ప్రణాళికలు
` రానున్న మూడేళ్లలో రూ.150కోట్ల పెట్టుబడులు
` తెలంగాణలో పెట్టుబడులను మరో మూడు కంపెనీలు సంసిద్ధత
` కేటీఆర్‌ అమెరికా పర్యటన విజయవంతం
` తెలంగాణ ఉత్తమ వ్యాపార వాతావరణాన్ని అందిస్తుందని నీతి ఆయోగ్‌ చెప్పిందన్న మంత్రి
హైదరాబాద్‌,మార్చి 27(జనంసాక్షి):న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్‌ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో సుమారు రూ. 150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సీజీఎంపీ ల్యాబ్‌తతోపాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నది. గడిచిన ఐదేళ్లలో హైదరాబాద్‌ ఫార్మాలో స్లేబ్యాక్‌ కంపెనీ సుమారు రూ. 2300 కోట్ల పెట్టుబడులు పెట్టింది.మంత్రి కేటీఆర్‌తో సమావేశం తర్వాత స్లేబ్యాక్‌ ఫార్మా వ్యవస్థాపకుడు, సీఈవో అజయ్‌ సింగ్‌ ఈ భారీ పెట్టుబడి ప్రకటన చేశారు. 2011లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి సాధించిన పురోగతి, విజయాలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు సీఈవో అజయ్‌ సింగ్‌ వివరించారు. అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి జెనెరిక్‌ ఔషధాల తయారీ, అనుమతులు పొందడానికి అవసరమైన క్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత తమ కంపెనీకి ఉందన్నారు. హైడ్రాక్సీప్రోజెస్టెరాన్‌ 5 ఎం.ఎల్‌ జెనరిక్‌ ఔషధానికి సంబంధించిన అనుమతులను పొందడంతో పాటు అమెరికన్‌ మార్కెట్‌లో తొలిసారి ప్రవేశపెట్టింది తమ కంపెనీనే అని తెలిపారు.హైదరాబాద్‌ ఫార్మారంగంలో స్లేబ్యాక్‌ ఫార్మా అసాధారణ ఎదుగుదల, విస్తరణ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి హైదరాబాద్‌ లో ఉన్న అనుకూలతలను ఉపయోగించుకుని స్లేబ్యాక్‌ కంపెనీ మరిన్ని విజయాలను సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ లోని అనేక లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు తమ విజయాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని కేటీఆర్‌ చెప్పారు. సంక్లిష్టమైన జనరిక్‌, స్పెషాలిటీ ఔషధాల తయారీ, అభివృద్ధిలో స్లేబ్యాక్‌ ఫార్మాకు మంచి పేరుంది. 35 మంది సిబ్బందితో 2017లో హైదరాబాద్‌ లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది. 2018 లో జీనోమ్‌ వ్యాలీలో పరిశోధన ల్యాబ్‌ ప్రారంభంతో కంపెనీ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌ లో 3 యూనిట్లున్నాయి. 106 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్లే బ్యాక్‌ కంపెనీకి ఇంజెక్టబుల్‌ ఫార్ములేషన్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబ్‌, ూూఆ ఫార్ములేషన్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబ్‌, ఎనలిటికల్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబ్‌లున్నాయి. ఇదిలావుండగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. చివరి రోజు పలు సంస్థల ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు.చివరి రోజు పలు సంస్థల ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు నాలుగు సంస్థలు ప్రకటించాయి. భారీ పెట్టుబడులకు లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా కంపెనీలు సంసిద్ధత తెలిపాయి. కేటీఆర్‌తో భేటీ తర్వాత కంపెనీలు నిర్ణయాలు వెల్లడిరచాయి.న్యూజెర్సీ కేంద్రంగా పని చేస్తోన్న స్లే బ్యాక్‌ ఫార్మా హైదరాబాద్‌ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించంది. రాబోయే మూడు సంవత్సరాల్లో సుమారు రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. గడిచిన హైదరాబాద్‌ ఫార్మాలో తమ కంపెనీ రూ.2,300 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు స్లే బ్యాక్‌ ఫార్మా వ్యవస్థాపకులు, సీఈఓ అజయ్‌ సింగ్‌ మంత్రి కేటీఆర్‌కు వివరించారు.హైదరాబాద్‌లోని లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా కంపెనీల్లో రూ.1,750 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ ముందుకొచ్చింది. లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, కల్పిస్తున్న మౌలిక వసతులు తమ విస్తరణ, ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని ఆ కంపెనీ తెలిపింది.అమెరికాకు చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఫార్మాకొపియా భారీ పెట్టుబడితో నిరంతర ఔషధ తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే అడ్వాన్స్‌డ్‌ ల్యాబ్‌లో 50 మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల బృందం పని చేస్తుందని కంపెనీ ప్రతినిధులు కేటీఆర్‌కు తెలిపారు. 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీనోమ్‌ వ్యాలీలో తాము ఏర్పాటు చేసే ఈ అత్యాధునిక ల్యాబ్‌కు సింథటిక్‌, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉంటుందని చెప్పారు.
తెలంగాణలో ఉత్తమ వ్యాపార వాతావరణం..మంత్రి కేటీఆర్‌
నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఎక్స్‌పోర్ట్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇండెక్స్‌ (ఈపీఐ`2021)లో అత్యుత్తమ వాణిజ్య వ్యాపార మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. అత్యధిక వస్తు సేవలు ఎగుమతి చేస్తున్న టాప్‌`5 రాష్ట్రాల్లో తెలంగాణ చోటు సంపాదించిందని నీతి ఆయోగ్‌ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.కాగా, ఈ విషయంపై రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ‘‘ తెలంగాణ ఉత్తమ వ్యాపార వాతావరణాన్ని అందిస్తుందని నీతి ఆయోగ్‌ చెప్పింది’’ అని ట్వీట్‌ చేశారు. ఇందుకు సంబంధించి ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని మంత్రి తన ట్వీట్‌కు జోడిరచారు.

 

3.‘స్విస్‌ ఓపెన్‌’ విజేతగా పీవీ సింధు..
ఫైనల్‌లో థాయ్‌ షట్లర్‌పై ఘన విజయం

 

4.నవ్విపోదురు గాక..
ఐదోసారి పెట్రోరేట్ల పెరుగుదల
దిల్లీ,మార్చి 27(జనంసాక్షి):దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు పరంపర కొనసాగుతోంది. గత ఆరు రోజుల్లో ఐదోసారి ధరలు పెరిగాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌ పై 50 పైసలు, డీజిల్‌ పై 55 పైసలు పెంచుతూ చమురు విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెంపు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత లీటర్‌ పెట్రల్‌ ధర దేశంలో రూ.3.70, డీజిల్‌ 3.75 వరకు పెరిగింది. తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.11, డీజిల్‌ ధర రూ.90.42గా కొనసాగుతోంది.దాదాపు నాలుగు నెలల పాటు స్థిరంగా ఉన్న చమురు (అతీబీటవ ూతిశ్రీ) ధరలు మార్చి 22 నుంచి పెరుగుతున్న విషయం తెలిసిందే. గత ఆరు రోజుల్లో ఒకరోజు లీటర్‌ పెట్రోల్పై 80 పైసలు పెరిగింది. జూన్‌ 2017 నుంచి రోజువారీ ధరల సవరణ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఒకరోజు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా.. 4 నెలలకు పైగా పెట్రోలు, డీజిల్‌ రేట్లలో మార్పు చేయలేదు. అంతర్జాతీయంగా ముడి చమురు పీపా ధర నవంబరులో 82 డాలర్లుగా ఉండగా.. మార్చి తొలి మూడు వారాల్లో 111 డాలర్లకు చేరింది. ఉక్రెయిన్‌`రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఓ దశలో బ్యారెల్‌ ధర 139 డాలర్లకూ చేరింది. అయినప్పటికీ 2021 నవంబరు 4 నుంచి 2022 మార్చి 21 వరకు పెట్రో ధరల్లో మార్పులు చేయలేదు. రేట్లలో మార్పు చేయకపోవడం వల్ల భారత అగ్రగామి ఇంధన రిటైలర్లయిన ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్పీసీఎల్లకు కలిపి 2.25 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.19,000 కోట్ల) నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

 

5.నూకలు తినమనడం కేంద్ర సర్కారు అహంకారానికి నిదర్శనం
` మంత్రి హరీశ్‌
సిద్దిపేట,మార్చి 27(జనంసాక్షి):వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తున్నది. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మనల్ని నూకలు తినమనడం అంటే యావత్తు తెలంగాణ ప్రజలను అవమాన పరచడమేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. ఆదివారం గజ్వేల్‌ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢల్లీి ప్రభుత్వాన్ని గద్దె దించింతేనె ధరలు తగ్గుతాయన్నారు. నూకలు తినమని అవమాన పరిచిన ఢల్లీి ప్రభుత్వానికి నూకలు చెల్లెలా రాబోయే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పెట్రోల్‌ డీజిల్‌, వంట గ్యాస్‌ పై పెంచిన ధరలను చేతనైతే తగ్గించి బీజీపీ మాట్లాడాలి.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల పోస్టులను భర్తీ చేసింది. మళ్లీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వనుందని ఆయన పేర్కొన్నారు. రక్షణ శాఖతో సహా దేశంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దమ్ముంటే వెంటనే 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని మంత్రి సవాల్‌ విసిరారు.

 

6.నేడే యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ
` హాజరుకానున్న సీఎం కేసీఆర్‌
యాదాద్రి భువనగిరి,మార్చి 27(జనంసాక్షి): రేపటి నుంచి యాదాద్రి ప్రధాన ఆలయాన్ని తెరవనున్నారు. ఈసందర్భంగా యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ రానున్నారు. ఈనేపథ్యంలో యాదాద్రిలో ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, యాదాద్రి దేవాలయ ప్రత్యేక అధికారి కిషన్‌ రావు పాల్గొన్నారు.

 

7.సంజయ్‌..కేంద్రం ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తుంది?
` లేదా క్షమాపణలు చెప్పు
` ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ డిమాండ్‌
హైదరాబాద్‌,మార్చి 27(జనంసాక్షి): తెలంగాణ రైతాంగం పండిరచిన ధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని గతంలో చెప్పిన బీజేపీ ఎంపీ బండి సంజయ్‌.. మాట విూద నిల్చుండాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయిస్తామని గతంలో బండి సంజయ్‌ మాట్లాడిన వీడియోలను ఆయన విడుదల చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంతో కలిసి బాల్క సుమన్‌ విూడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా బాల్క సుమన్‌ మాట్లాడుతూ, యాసంగిలో వరి వెయ్యాలని, తామే కొనిపిస్తామని రైతులను బీజేపీ నాయకులు రెచ్చగొట్టి, ఇపుడు మాత్రం ధాన్యం కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనంటూ మాట మారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతాంగంపై కేంద్రం కక్ష గట్టిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్న తీరును ఖండిస్తున్నానని చెప్పారు. ధాన్యం సేకరణపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాల్సింది పోయి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండిరచాల్సింది పోయి వెనకేసుకు రావడం శోచనీయమని సుమన్‌ పేర్కొన్నారు. పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యల వీడియోను బండి సంజయ్‌ అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 400 రెట్లు పెరిగిందని, ఇది కేసీఆర్‌ రైతు అనుకూల విధానాల వల్ల కాదా? అని బాల్క సుమన్‌ నిలదీశారు. కేంద్రం వంద శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసే దాకా తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఒకే దేశం ఒకే సేకరణ విధానం తేవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ విూద బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. జీడీపీ పెంచమంటే బీజేపీ సర్కారు గ్యాస్‌ డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచుతోందని ఎద్దేవా చేశారు. గుజరాత్‌ను దాటి పోతుందనే దుగ్ధతోనే బీజేపీ తెలంగాణపై కక్ష కట్టిందని మండిపడ్డారు.

 

8.ఆకట్టుకున్న ఏవియేషన్‌ షో ..
చివరి రోజు పోటెత్తిన సందర్శకులు
హైదరాబాద్‌,మార్చి 27(జనంసాక్షి): బేగంపేట విమానాశ్రయంలో నాలుగు రోజుల పాటు సందడిగా సాగిన ఏవియేషన్‌ షో విజయవంతంగా ముగిసింది. ఈసారి సమ్మిట్‌ వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు, భారత్‌లో ఏవియేషన్‌ సెక్టార్‌ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలతో సాగింది.ఏవియేషన్‌ షోకు చివరి రెండ్రోజులు సందర్శకులు పోటెత్తారు. ఇవాళ చివరి రోజు కావటంతో పెద్ద ఎత్తున బేగంపేట విమానాశ్రయానికి నగరవాసులు తరలివచ్చారు.20కు పైగా దేశాలు, 8 రాష్ట్రాల నుంచి 5వేల మంది వ్యాపార ప్రతినిధులు, 60వేల మంది సందర్శకులు సందర్శించారు. నిన్న 22వేల మంది ఏవియేషన్‌ షోను తిలకించగా, ఇవాళ ఆదివారం చివరి రోజు కావడంతో 38వేల మంది నగరవాసులు ఎయిర్‌పోర్టుకు రావడంతో ఆ ప్రాంగణమంతా సందర్శకులతో కిటకిటలాడిరది. సారంగ్‌ టీమ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిర్‌ షో ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భిన్న ఫార్మేషన్స్‌తో ఎయిర్‌ ఫోర్స్‌ బృందం చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. అయితే, ఎయిర్‌ షోను తిలకించేందుకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన అభిమానులను బారికేడ్ల అవలే వరకే అనుమతించడంతో నిరుత్సాహానికి గురయ్యారు. భిన్న రకాల ఎయిర్‌ క్రాఫ్ట్‌లను ఒక దగ్గర చూసేందుకు అవకాశం లభించడంతో హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిల్లలు, గృహిణులు విమానాల ప్రదర్శన, ఎయిర్‌ షోను తిలకించడం కొంగొత్త అనుభూతిని మిగిల్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

 

9.చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...
తొమ్మిది మంది మృతి
తిరుపతి,మార్చి 27(జనంసాక్షి): చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు జరిగింది.ఈ ఘటనలో 9 మంది మృతిచెందారు. మదనపల్లె ` తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపు వద్ద శనివారం రాత్రి ప్రైవేటు బస్సు బోల్తా పడిరది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, 54 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం నాగలక్ష్మి మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వేణు కుటుంబం ధర్మవరం నుంచి తిరుచానూరు వెళ్తుండగా.. భాకరాపేట సవిూపంలో బస్సు లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. రాత్రి మృతి చెందిన 8మంది అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం దర్మవరంలో నిర్వహించారు.
ఘటనపై ప్రముఖులగ్భ్భ్రాంతి
చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ స్పందించారు. ప్రమాదఘటనతో తీవ్రగ్భ్భ్రాంతి చెందానని రాష్ట్రపతి కోవింద్‌ ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈమేరకు ట్విటర్లో ఆయన పోస్టు చేశారు. బస్సుప్రమాద ఘటన అంత్యంత విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోరుకోవాలని ట్విటర్‌ ద్వారా ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం: మోదీ
భాకరాపేట బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి పరిహారం అందించనున్నట్లు ప్రధాని వెల్లడిరచారు. నిన్న రాత్రి భాకరాపేట ఘాట్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో చిన్నారితో సహా ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

 

 

10.పెంచిన ఎక్పైజ్‌ సుంకం రూ.25లక్షల కోట్లు ఏంచేశారు?
` ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ ఫైర్‌
దిల్లీ,మార్చి 27(జనంసాక్షి): చమురు ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై వార్‌ ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన ఆ పార్టీ..తాజాగా ఎక్సైజ్‌ సుంకం ద్వారా వచ్చిన రూ.26 లక్షల కోట్లు ఏం చేశారో లెక్క చెప్పాలని డిమాండ్‌ చేసింది. వారం రోజుల వ్యవధిలో పెట్రోల్‌, డీజిల్‌ ధర 3.70 రూ.3.75 మేర పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ఈ మేరకు ఆదివారం ట్వీట్‌ చేశారు.గత ఎనిమిదేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ ద్వారా ఎక్సైజ్‌ సుంకం రూపంలో ?26 లక్షల కోట్లు ప్రజల నుంచి కేంద్రం దోచుకుందని సూర్జేవాలా విమర్శించారు. ఎన్నికల కోసం 137 రోజుల పాటు ధరలను స్థిరంగా ఉంచిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు పూర్తవ్వగానే లీటర్‌కు ?3.75 మేర పెంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బహిరంగ సభలో మాట్లాడిన పాత వీడియోను సూర్జేవాలా ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. తన అదృష్టం వల్ల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయని మోదీ అన్నట్లు ఆ వీడియోలో ఉంది. దీనిపై సూర్జేవాలా స్పందిస్తూ.. మరి ఎవరి దురదృష్టం వల్ల ప్రజలు ఇప్పుడు ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్నారు అని ప్రశ్నించారు.కాంగ్రెస్‌కు చెందిన మరో అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా కూడా ఇదే విషయమై కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేవలం ఎన్నికల కోసమే ఇటీవల కాలంలో పెట్రో ధరలను కేంద్రం స్థిరంగా ఉంచిందన్నారు. ఎన్నికల్లో గెలవడం కన్నా.. ప్రజా సమస్యలపై పోరాడడమే కాంగ్రెస్‌కు ముఖ్యమన్నారు. అందుకే చమురు ధరలపై కాంగ్రెస్‌ పార్టీ పోరు ప్రారంభించిందని చెప్పారు. ఎక్సైజ్‌ సుంకం ద్వారా వసూలు చేసిన ?26 లక్షల కోట్లకు దేశం లెక్కలు తెలుసుకోవాలని అనుకుంటోందని ఖేరా అన్నారు.

 

11.కోవిడ్‌ కలకలం తర్వాత(కిక్కర్‌
యధావిధిగా అంతర్జాతీయ విమాన సర్వీసులు
` ఆంక్షలు సడలించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ
దిల్లీ,మార్చి 27(జనంసాక్షి): యావత్‌ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే, ప్రపంచ వ్యాప్తంగా,కరోనా వైరస్‌ అదుపులోనే ఉండడం, వ్యాక్సిన్‌ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ కన్నా ముందు మాదిరిగానే అన్ని సర్వీసులు యథావిధిగా నడిచే విధంగా ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆంక్షల సడలింపు ఆదివారం నుంచే అమలులోకి వచ్చిందని వెల్లడిరచింది. దీంతో గత రెండేళ్లుగా బ్రేక్‌ పడిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు తిరిగి రెక్కలు వచ్చినట్లు అయ్యింది.ఇక విమానాశ్రయాలు, విమానాల్లో ఇంతకుముందు విధించిన కొవిడ్‌ నిబంధనలనూ పౌరవిమానయాన శాఖ సడలించింది. ముఖ్యంగా విమాన సిబ్బంది పీపీఈ కిట్లను ధరించాల్సిన అవసరం లేదు. కానీ, ఎయిర్‌పోర్టులు, విమానాల్లో మాస్కులు ధరించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం వంటివి తప్పనిసరి చేసింది. అంతేకాకుండా అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో అత్యవసర విభాగం కింద మూడు సీట్లను ఖాళీగా ఉంచాలని విమానయాన సంస్థలకు సూచించింది. వీటితోపాటు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మారిషస్‌, మలేషియా, థాయిలాండ్‌, టర్కీ, అమెరికా, ఇరాన్‌తోపాటు దాదాపు 40దేశాలకు చెందిన 60 విమానయాన సంస్థలు భారత్‌కు సర్వీసులు నడిపేందుకు మార్గం సుగమమైంది. దీనిపై వెంటనే స్పందించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌.. కువైట్‌, అబుదాబీ, షార్జా, జెడ్డా, రియాద్‌, దోహా, బ్యాంకాక్‌తోపాటు ఇతర దేశాల్లోని 150 రూట్లలో అంతర్జాతీయ సర్వీసులను త్వరలోనే పునఃప్రారంభిస్తామని ప్రకటించింది.ఇదిలాఉంటే, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి కారణంగా అంతర్జాతీయ విమానాలపై గత రెండేళ్లుగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌, యూఏఈ ఇలా.. సుమారు 28 దేశాలతో (ంతితీ ఃబీపపశ్రీవ) ఒప్పందం కుదుర్చుకున్న భారత ప్రభుత్వం.. ఆయా దేశాలకు ప్రత్యేక విమానాలను నడుపుతోంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సవిూక్షిస్తోన్న ప్రభుత్వం పూర్తిస్థాయి అంతర్జాతీయ విమానాలను గతేడాది ప్రారంభించాలని భావించినప్పటికీ.. ఒమిక్రాన్‌ కారణంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం, వివిధ దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నందున అంతర్జాతీయ విమాన సర్వీసులను యథావిధిగా తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 

12.సార్వత్రిక సమ్మెకు మద్దతు
` రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీయూడబ్ల్యూజే కె.విరాహత్‌ అలీ
హైదరాబాద్‌,మార్చి 27(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 28న దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపడుతున్న సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రకటించింది. ఆదివారం నాడు హైదర్‌ గుడ లోని సెంట్రల్‌ పార్క్‌ హోటల్‌ లో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు. కార్మికులు, వర్కింగ్‌ జర్నలి స్టులు పోరాటాలతో సాధించుకున్న పలు చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలు తెస్తూ తీరని ద్రోహం తలపెట్టడం సహించరానిదని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్‌ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

 

13.నాటో ఏం చేస్తోంది..?
దానిని రష్యా నడుపుతోందా..?
` మాకు ఆయుధాలు కావాలి :జెలెన్‌స్కీ
` లివీవ్‌పై క్రూయిజ్‌ క్షిపణుల దాడి..
కీవ్‌,మార్చి 27(జనంసాక్షి): రష్యా దాడులను ఉద్ధృతం చేసిన నేపథ్యంలో పశ్చిమ దేశాల ప్రభుత్వాలు తమకు ఆయుధాలు పంపించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి అభ్యర్థించారు.యుద్ధ విమానాలు, ట్యాంకులు, క్షిపణి రక్షణ వ్యవస్థలను పంపాలని కోరారు. ఈ మేరకు జెలెన్‌స్కీ శనివారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు.ఐరోపాలో స్వేచ్ఛను కాపాడగల భారీ ఆయుధాలు గోదాముల నిల్వల్లో దుమ్ములో పేరుకుపోయాయని జెలెన్‌స్కీ తీవ్రంగా విమర్శించారు. రష్యన్‌ విమానాలను మెషిన్‌ గన్‌లతో పేల్చివేయలేమన్నారు. ‘నాటో ఏం చేస్తోంది..? దానిని రష్యా నడుపుతోందా..?31 రోజులు గడిచాయి.. వారు దేని కోసం ఎదురు చూస్తున్నారు..? నాటో వద్ద ఉన్న దానిలో మేం 1 శాతం మాత్రమే అడుగుతున్నాం. ఇంకేవిూ లేదు’ అని జెలెన్‌స్కీ భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు.
లివీవ్‌పై క్రూయిజ్‌ క్షిపణుల దాడి..
లివీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే మేరియుపొల్‌తోపాటు వివిధ నగరాలను ధ్వంసం చేసిన రష్యా... ఇప్పుడు లివీవ్‌పైనా బాంబుల వర్షం కురిపిస్తోంది.ఈ క్రమంలో ఆ ప్రాంతంపై అత్యంత ప్రమాదకర క్షిపణులను ప్రయోగిస్తోంది. తాజాగా లివీవ్‌పై క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించినట్లు మాస్కో రక్షణ శాఖ స్వయంగా వెల్లడిరచింది. లివీవ్‌ సవిూపం నుంచి ఉక్రెయిన్‌ దళాలు ఉపయోగిస్తున్న ఇంధన డిపోను రష్యా సుదూర క్షిపణులతో ధ్వంసం చేసింది. యాంటీ`ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌లు, రాడార్‌ స్టేషన్‌లు, ట్యాంకులను రిపేర్‌ చేసేందుకు వినియోగిస్తున్న ఓ ప్లాంట్‌పై దాడి చేసేందుకు క్రూయిజ్‌ క్షిపణులను ఉపయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌కు అందే మానవతా సాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు చేరే చమురు, ఆహార సరఫరాలను రష్యా ధ్వంసం చేయడం ప్రారంభించిందని ఉక్రెయిన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి వాడిమ్‌ డెనిసెంకో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దుకు మాస్కో కొత్త దళాలను దించడం ప్రారంభించిందని కూడా ఆ తెలిపారు.

 

14.బిహార్‌ సీఎం నీతీశ్‌పై యువకుడి దాడి..
పట్నా,మార్చి 27(జనంసాక్షి): బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. సీఎం సొంత ఊరైన భకిత్యాపూర్లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి యత్నించిన వ్యక్తిని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.స్థానిక ఆసుపత్రి ప్రాంగణంలో షిల్భద్ర యాజీ అనే స్వాతంత్ర సమరయోధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నితీశ్‌ హాజరయ్యారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తుండగా.. వెనుక నుంచి వేగంగా నడుచుకుంటూ స్టేజ్పైకి వచ్చిన ఓ యువకుడు సీఎం వీపుపై కొట్టాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక స్థితి సరిగాలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భద్రతా సిబ్బంది ఉండగా ఓ సాధారణ వ్యక్తి ఇలా దాడికి పాల్పడటం భద్రతా వైఫల్యాన్ని తెలియజేస్తోంది.

 

15.జూన్‌ 30 నుంచి అమర్నాథ్‌ యాత్ర
` జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం వెల్లడి
శ్రీనగర్‌,మార్చి 27(జనంసాక్షి): హిమాలయాల్లో ఏటా వెలిసే అమర్నాథుడి మంచు లింగం దర్శనానికి సంబంధించి ఈ ఏడాది తేదీలు ఖరారయ్యాయి. జూన్‌ 30 నుంచి అమర్నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 43 రోజలపాటు ఈ యాత్ర కొనసాగనుంది. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన ఆదివారం జరిగిన శ్రీ అమర్నాథ్జీ దేవాలయ బోర్డు (ఎస్‌ఏఎస్బీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్జీ కార్యాలయం వెల్లడిరచింది. పూర్తి కొవిడ్‌ నిబంధనల మధ్య కొనసాగుతుందని.. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్‌ రోజున ఈ యాత్ర ముగుస్తుందని తెలిపింది.గత రెండు, మూడేళ్లుగా అమర్నాథ్‌ యాత్ర పూర్తిస్థాయిలో కొనసాగడం లేదు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్‌ 370 రద్దు సందర్భంగా 2019లో యాత్ర మధ్యలోనే రద్దు అయ్యింది. అనంతరం దేశంలో కొవిడ్‌ విస్తృతి పెరగడంతో రెండేళ్లుగా పూర్తి స్థాయిలో యాత్ర చేపట్టడం లేదు. ప్రస్తుతం కొవిడ్‌ ఉద్ధృతి అదుపులోనే ఉండడంతో ఈ యాత్రను యథావిధిగా కొనసాగించేందుకు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం సిద్ధం అవుతోంది.దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల్లో దాదాపు 3880 విూటర్ల ఎత్తైన ప్రదేశంలో ఉన్న అమర్నాథుడి దర్శనం కోసం దేశవ్యాప్తంగా ఏటా భారీ ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. మొత్తం 43 రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుంది. కశ్మీర్లో ఉగ్రవాద ముప్పు ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ యాత్ర కొనసాగుతుంది.