*వెహికిల్ చాలనాలా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంది*

- మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య

మునగాల, మార్చి 03(జనంసాక్షి): చలానా ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వన్ ఇయర్ వద్ద నుండి అక్రమంగా దోపిడి చేస్తుందని సూర్యాపేట జిల్లా మునగాల మండల కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు తెలియకుండా ఫోటోలు కొట్టి ఫైన్ లు వేయడం సరియైన పద్దతి కాదని, వాహనదారులకు తన వాహనంపై ఎంత ఫైన్ ఉందో కూడా తెలియని పరిస్థితని, అంతకు ముందు రోజులే బాగున్నాయని, అంతకు ముందు రోజుల్లో వాహనదారులను ఆపి కేసులు వ్రాసినప్పుడు వాహనం పై ఎందుకు కేసు అయ్యింది, దేని నిమిత్తం అయ్యింది అనే విషయం సామాన్య ప్రజలకు తెలిసేదని, కానీ ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు కొట్టడం ఫైన్ వేయడం వ


లన ప్రజలు అయోమయానికి, గందరగోళం నెలకొందని మండవ చంద్రయ్య అన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ప్రజలపై భారం పడకుండా చూడాలని మండవ చంద్రయ్య అన్నారు. ఇటువంటి వాటిపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమించి ప్రభుత్వం స్పందించే వరకు పోరాడుతుందని మండవ చంద్రయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో అమరగాని రమేష్, గన్నా రామయ్య, మండవ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.