పెండిరగ్‌ చలాన్ల క్లీయరెన్స్‌కు విశేష స్పందన


నిమిషానికి 700 పెండిరగ్‌ చలాన్ల క్లీయరెన్స్‌

హైదరాబాద్‌,మార్చి1 (జనం సాక్షి): తెలంగాణలో ట్రాఫిక్‌ చలాన్ల డిస్కౌంట్‌కు విశేష స్పందన వస్తోంది. నిమిషానికి 700 పెండిరగ్‌ చలాన్లను అధికారులు క్లియర్‌ చేస్తున్నారు. బైక్‌లు, ఆటోలకు 75 శాతం, కారు, లారీ, హెవీ వెహికిల్స్‌కు 50 శాతం రాయితీని తెలంగాణ పోలీసులు కల్పించిన విషయం తెలిసిందే.
మాస్క్‌ చలాన్లపై 90 శాతం రాయితితో వాహనాదారు పెద్ద ఎత్తున క్లియర్‌ చేసుకుంటున్నారు. చలాన్ల రయితీ ఈ నెల 31 వరకు అందుబాటులో ఉండనుంది. గత నాలుగేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 6.19 కోట్ల ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. పెండిరగ్‌ చలాన్ల క్లియరెన్స్‌కు ప్రత్యేక అవకాశం కల్పించిన తెలంగాణ పోలీసులు వాహనదారులకు మరో శుభవార్త చెప్పారు. చలాన్ల చెల్లింపుల కోసం గంటల తరబడి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లలో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే చలానాలు చెల్లించాలని సూచించారు. ఈ`చలాన్‌ ద్వారా అన్ని పెండిరగ్‌ చలాన్లు చెల్లించాలని ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేశారు. పెండిరగ్‌ చలాన్ల చెల్లింపునకు ఫోన్‌ పే, పేటీఎం, గూగుల్‌ పే వంటి సేవలను కూడా ఉపయోగించు కోవచ్చని సూచించారు. అటు విూ సేవ, ఈ సేవలో కూడా చలానాలు చెల్లించేలా ట్రాఫిక్‌ పోలీస్‌లు అవకాశం కల్పించారు.