ప్రజల కోసమే ఈ పాదయాత్ర:మూడోరోజు యాత్రలో భట్టి

 


ఖమ్మం,మార్చి1 (జనం సాక్షి): పీపుల్స్‌ మార్చ్‌ ఎన్నికల కోసం కాదని.. ప్రజల కోసమని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క అన్నారు. జిల్లాలోని ముదిగొండ మండలం సువర్ణాపురంలో నిర్వహించిన పీపుల్స్‌ మార్చ్‌లో ఆయన మాట్లాడుతూ....ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను కేసీఆర్‌ నెరవేర్చలేదని విమర్శించారు. అడిగితే అసెంబ్లీ బంద్‌ చేస్తారని.. ప్రశ్నిస్తే కేసులు పెడతారని మండిపడ్డారు. పండిరచిన పంటకు మద్దతు ధర అడిగితే.. రైతులకు బేడీలు వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. రేట్లు పెంచడంలో మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బ్జడెట్‌ లెక్కలు అడిగితే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై పోరాడేందుకే..సమస్యలను తెలుసుకునేందుకే తాను పాదయాత్రచేపట్టానని అన్నారు.