పిల్లలు మృతి..తల్లి పరిస్థితి విషమం
కర్నూలు,మార్చి5 (జనం సాక్షి): కర్నూలు మండలం పూలతోటలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలిచివేసింది. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిరది. ఈ సంఘటనలో ఇద్దరి పిల్లలు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలతో బావిలోకి దూకిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ పిల్లలు మృతి చెందగా తల్లిని బయటకు తీశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు.
పిల్లలతో కలసి బావిలో దూకిన తల్లి