ఆర్టీసీలో రౌండప్‌ ఛార్జీలు


చిల్లర సమస్యలకు చెక్‌ పెట్టిన సంస్థ

హైదరాబాద్‌,మార్చి18 (జనంసాక్షి):  తెలంగాణ ఆర్టీసీ ప్లలె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్‌ పడిరది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ రౌండప్‌ చార్జీలను ఖరారు చేశారు. దీంతో స్వల్పంగా ఛార్జీలు కూడా పెరిగాయి. శుక్రవారం నుంచి ఈ కొత్త రౌండప్‌ చార్జీలను ఆర్టీసీ అమలులోకి తీసుకువచ్చింది. రూ.12చార్జీ ఉన్న చోట టికెట్‌ను యాజమాన్యం రూ.10 రౌండప్‌ చేసింది. రూ.13, రూ.14 ఉన్న చోట.. ఆ టికెట్లను రూ. 15గా రౌండప్‌ చేశారు. 80 కీలోవిూటర్ల దూరానికి ఇప్పటి వరకు రూ.67 వసూలు చేస్తుండగా రౌండప్‌ ఖరారుతో చార్జీలు రూ.65గా నిర్దారించారు. టోల్‌ ప్లాజాల వద్ద ఆర్డినరీకి రూ.1.. హైటెక్‌, ఏసీ బస్సులకు రూ.2 వసూలు చేయనున్నారు.