జెఎసి కన్వీనర్ కొలికపూడి
అమరావతి,మార్చి4 ( జనంసాక్షి ) : రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉండాలని అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్ అన్నారు. ఆంద్రప్రదేశ్ నీకు అధికారం లేని అంశంలో శాసనాధికారం లేదు అని హైకోర్టు నిన్న రాసింది. ఇప్పుడు జగన్ ఏం చేస్తాడని ఆయన ప్రశ్నించారు. ఇంతజరిగినా జగన్ మారడని ఎద్దేవా చేశారు.ఈ జడ్జిమెంట్ లో ఏముంది... అని సీఎం అన్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో 3 రాజధానులు పెట్టి గెలిస్తే చేస్తాను అంటాడు. 6 నెలల తరువాత శాసనసభ రద్దు అవుతుందని, మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రప్రభుత్వం టెండర్లుకు వెళ్లి బాంక్ రుణాలు తీసుకొని ఆ డబ్బుతో పథకాలకు ఖర్చుస్తోందన్నారు.అందుకే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్‌లో వైసిపిని ఓడిరచడానికి అందరం కలసి పనిచేయాలని అన్నారు.
రాజధానిపై జగన్ మొడిపట్టు వీడాలి