1.భూకంపం సృష్టిస్తాం
` 24గంటల్లో తేల్చండి
` కేంద్రానికి కేసీఆర్ అల్టిమేటం
` వడ్లు కొనకపోతే వదిలేది లేదు
` విూరంతా సత్యహరిశ్చంద్రులా
` మాపైకే సీబీఐ,ఈడీ ఉసిగొల్పుతారా..
` దమ్ముంటే రండి..జైలుకెలా పంపుతారో చూస్తా
` ఢల్లీి వేదికగా రైతునిరసన దీక్షలో సీఎం గర్జన
( ధాన్యం సేకరణపై జాతీయవిధానం కావాలి
` ఓ ప్రభుత్వం ఢల్లీిలో దీక్ష చేయడం దారుణం
` ఇది కేంద్రం తలదించుకోవాల్సిన విషయం
` రైతుసంఘం నాయకుడు రాకేశ్ టికాయత్)
(టిఆర్‌ఎస్ దీక్షతో ప్రాంగణమంతా గులాబీమయం
హాజరైన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు)
న్యూఢల్లీి,ఏప్రిల్ 11(జనంసాక్షి):రాష్ట్ర బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని అంటున్నారు.. దమ్ముంటే రండి అని కేసీఆర్ సవాల్ విసిరారు. ఢల్లీిలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.కేంద్రం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ.. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రానికి ఎదురు తిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తారు. బీజేపీలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా? వాళ్ల దగ్గరకు ఈడీ, సీబీఐ వెళ్లదు.. ప్రతి రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులను బెదిరిస్తున్నారు. సీఎంను జైలుకు పంపుతామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. ఊరికే మొరగడం సరికాదని కేసీఆర్ అన్నారు. కేంద్రం పంట మార్పిడి చేయాలని సూచించినట్లు తాము రైతులకు చెప్పామని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఉద్దేశపూర్వకంగా రైతులు ధాన్యం పండిరచండి.. మేము కొంటామని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రైతులను రెచ్చగొట్టాడు. రైతులు పండిరచిన ధాన్యం కొనుగోలు చేయాలని తాము ఢల్లీిలో ధర్నా చేస్తే.. పోటీగా బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్లకు సిగ్గుండాలని కేసీఆర్ విమర్శించారు. ఏ ఉద్దేశంతో బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందన్నారు. అంతిమ విజయం సాధించేంత వరకు విశ్రమించేది లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. రైతుల పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ రూపొందించాలని కేంద్రాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే మోదీని తరిమికొడుతాం అని హెచ్చరించారు.వచ్చే ప్రభుత్వంతో ఆ పాలసీని రూపొందిస్తామని స్పష్టం చేశారు. మోదీకి ధనం కావాలి లేదా ఓట్లు కావాలి. ధాన్యం వద్దు.. ఇదే విూ ప్రభుత్వ కుట్ర అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. రైతులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. రైతుల సంక్షేమం కోసం జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్‌తో కలిసి పని చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజానీకం తికాయత్ వెంట ఉంటుందని చెప్పారు. రాకేశ్ తికాయత్‌ను కేంద్రం ఎన్ని విధాలుగా అవమానించిందో మనమంతా చూశామని తెలిపారు. తికాయత్‌ను దేశద్రోహి అన్నారు.. ఉగ్రవాది అన్నారు. రైతుల కోసం అవమానాలు భరిస్తూనే ముందుకు సాగుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. దర్నా అనంతరం కెసిఆర్ ఢల్లీి పర్యటన ముగిసింది. పది రోజుల పాటు ఢల్లీిలో ఉన్న కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బయల్దేరారు. ధాన్యం సేకరణపై కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ ఢల్లీిలోని తెంలగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్ పార్టీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. రైతుల సంక్షేమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను కేసీఆర్ ఎండగట్టారు. ఈ దీక్ష ముగిసిన అనంతరం సీఎం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.
ధాన్యం సేకరణపై జాతీయవిధానం కావాలి: రాకేశ్ టికాయత్
టీఆర్‌ఎస్ ఢల్లీిలో చేపట్టిన రైతుల దీక్షకు భారతీయ కిసాన్ యూనియన్ నేత తికాయత్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోందన్నారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం ఢల్లీిలో పోరాడడం కేంద్రానికి సిగ్గుచేటన్నారు. ధాన్యం కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి.కేంద్ర విధానంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.సీఎం కేసీఆర్ రాజకీయ ఉద్యమం చేయడం లేదు.. రైతుల కోసం ఆందోళన చేస్తున్నారు.విపక్ష సీఎంలు ఏకమై ఢల్లీిలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి.రైతులు చేస్తున్నవి ఓట్ల దీక్షలు కావని తికాయత్ వ్యాఖ్యానించారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఏం జరుగుతోందని తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు మరణిస్తూనే ఉండాలా? అని ప్రశ్నించారు. దేశంలో రైతులు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారు. ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢల్లీిలో పోరాడడం కేంద్రానికి సిగ్గుచేటు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది. సాగుచట్టాల రద్దు కోసం ఢల్లీిలో 13 నెలల పాటు ఉద్యమించాం. కేంద్రం ఏడాదికి 3 విడతలుగా రైతులకు రూ. 6 వేలు ఇస్తోంది. ఏడాదికి రూ. 6 వేలు ఇస్తూ రైతులను ఉద్ధరిస్తున్నట్లు కేంద్రం మాట్లాడుతోంది అని ఎª`దదెవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మద్దతుగా ఈ ఆందోళన చేస్తున్నారు. కేసీఆర్ చేస్తున్నది రాజకీయ ఉద్యమం కాదు అని తికాయత్ స్పష్టం చేశారు. రైతుల కోసం మమతా బెనర్జీ కూడా ఆందోళన చేస్తున్నారు. రైతుల పక్షాన కేసీఆర్ చేస్తున్న ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. రైతుల కోసం పోరాటం ఎవరు చేసినా వారికి మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటం అభినందనీయమని తికాయత్ ప్రశంసలు కురిపించారు.
టిఆర్‌ఎస్ దీక్షతో ప్రాంగణమంతా గులాబీమయం
దేశరాజధాని న్యూఢల్లీిలో టిఆర్‌ఎస్ చేపట్టిన రైతు నిరసన దీక్ష ప్రారంభం అయ్యింది. రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో ఢల్లీిలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన దీక్షకు ముఖ్యమంత్రి కేసీఆర్, రైతునేత రాకేశ్ తికాయత్ హాజరయ్యారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి, మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ చిత్రపటాలకు కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పుష్పాలు సమర్పించారు.ఈ దీక్షలో మంత్రులు, టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నాయకులు పాల్గొన్నారు. దీక్షతో ఢల్లీిలోని తెలంగాణ భవన్ గులాబీమయం అయింది. తెలంగాణ భవన్ పరిసరాల్లో టీఆర్‌ఎస్ ప్లెక్సీలు, జెండాలతో అలంకరణ చేశారు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం సేకరించాలనే డిమాండ్‌తో ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ దీక్షద్వారా కేంద్రంపై పోరును మరింత తీవ్రం చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఈ దీక్షలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నలుపు రంగు వస్త్రాలు ధరించిన సండ్ర వెంకటవీరయ్య, వరి కంకులతో సభాస్థలికి చేరుకున్నారు. ఆకుపచ్చ రంగు తలపాగ ధరించి రైతులకు సంఫీుభావం ప్రకటించారు. కావడికి ముందు మోదీ ఫోటోను, వెనుకాల వరికంకులను ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నలుపు రంగు వస్త్రాలు ధరించి దీక్షకు హాజరయ్యారు.
2.కొలువుదీరిన జగన్ మంత్రి వర్గం
` కొత్తమంత్రులకు శాఖలు అప్పగింత
అమరావతి,ఏప్రిల్ 11(జనంసాక్షి):ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరింది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సవిూర్ శర్మ చదువుతూ ఉండగా.. ఆ ప్రకారం వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులకు తేనీటి విందుకు హాజరయ్యారు.కాగా, ఆదివారం రాత్రి కొత్త మంత్రులు జాబితాను సీఎం కార్యాలయం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు పంపించింది. అంతకు ముందే గవర్నర్ 24 మంది పాత మంత్రుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారికంగా పత్రికా ప్రకటన జారీ చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు 24 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని, ఇది వెంటనే అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపారు.
3.పాక్ తదుపరి ప్రధానిగా షెహబాజ్ షరీఫ్
` ఏకగ్రీవంగా ఎన్నికున్న సభ్యులు
ఇస్లామాబాద్,ఏప్రిల్ 11(జనంసాక్షి):పాకిస్థాన్ కొత్త ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష పీఎంఎల్`ఎన్ నేత అయిన 70 ఏళ్ల షెహబాజ్.. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు కూడా. ప్రధాని ఎన్నిక కోసం.. సోమవారం నేషనల్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. గత అధికార పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యుల రాజీనామాతో ఏర్పడిన ప్రతిష్టంబనను తొలగించేందుకు ఓటింగ్ నిర్వహించింది. ఈ ఓటింగ్‌లో షెహబాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాక్ ప్రధాని రేసు కోసం పీటీఐ నుంచి షా మహమ్మద్ ఖురేషీ, షెహబాజ్ షరీఫ్ ఇద్దరూ పోటీపడ్డారు. అయితే పీటీఐ సభ్యుల మూకుమ్మడి రాజీనామాతో ప్రభుత్వం కుప్పకూలగా.. ఖురేషీ అభ్యర్థిత్వానికి బలం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. షెహబాజ్ షరీఫ్ 2018లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పాకిస్థాన్ రాజకీయ చరిత్రలో తొలిసారిగా.. ఒక ప్రధానిని అవిశ్వాస తీర్మానంతో గ్దదె దించారు. 174 ఓట్లతో ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధాని పదవి నుంచి దింపేశారు.
4.ఉల్టా చోర్..(కిక్క
వడ్లు రాష్ట్రమే కొనలాట!
` భాజపా దొంగాట
హైదరాబాద్,ఏప్రిల్ 11(జనంసాక్షి):ఎవరి కోసం తెలంగాణ భవన్‌లో ధర్నా చేస్తున్నారని కేంద్రమంత్రి మురళీధరన్ ప్రశ్నించారు. ఇందిరాపార్క్ వద్ద బీజేపీ వరి దీక్షలో పాల్గొన్న ఆయన.. మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వడ్లు కొని కేంద్రానికి ఇవ్వాలన్నారు. కేసీఆర్ వడ్లు కొనేందుకు వెనకాడుతున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఇచ్చే డబ్బులన్నీ కేంద్రానివేనన్నారు. మోడీతో కొట్లాడటానికి, రాష్టాల్రు తిరగడానికి డబ్బులుంటాయి కానీ...వడ్లు కొనడానికి లేవా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసేవన్నీ నాటకాలేనన్నారు. కేసీఆర్‌కు పాకిస్థాన్ పై ఉన్న నమ్మకం దేశప్రజలపై లేదన్నారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల కరప్షణ్ రావు, కవిూషన్ రావు అని అన్నారు. కేసీఆర్ చీప్ మినిస్టర్ కాదని..చీఫ్ మిస్ లీడర్ అని అన్నారు. కవిూషన్ రావు దేశాన్ని మోసం చేస్తున్నారన్నారు. హుజురాబాద్, దుబ్బాకలో ప్రజలు టీఆర్ ఎస్ కు బుద్ధి చెప్పారన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారన్నారు. ఇదిలావుంటే వడ్లు కొనకుంటే కేసీఆర్ గద్దె దిగాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇందిరాపార్క్ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్‌కు వయసు విూద పడి సోయి తప్పి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ చార్జీలు, కరెంట్ బిల్లుల నుంచి..డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ ఢల్లీి వెళ్లారని చెప్పారు. కవిూషన్లకు టీఆర్‌ఎస్ నేతలు బాగా రుచిమరిగారని మండిపడ్డారు. కేసీఆర్ ఒక పాస్ పోర్ట్ బ్రోకర్ అని ఆరోపించారు. పత్తి, మిర్చి ధర పెరగడానికి కారణం కేంద్రమేనని స్పష్టం చేశారు. రైతు సమన్వయ సమితులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మందులో సోడా పోసేవాళ్లకు.. సమన్వయ సమితుల బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. ఇసుక, పాస్‌పోర్ట్ దందాలు చేశారని , ఇప్పుడు బియ్యం దందా చేస్తున్నారని బండి సంజయ్ దెప్పిపోడిశారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఢల్లీిలో ధర్నా చేస్తున్నారన్నారని బండి సంజయ్ అన్నారు. 11 వ తేదీ వచ్చినా రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాల్లేవన్నారు. తన రాజకీయాల కోసం కేసీఆర్ రైతులను వాడుకుంటున్నారన్నారు. సన్న వడ్లు వేసిన రైతులు రోడ్డున పడ్డారన్నారు. కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్ లో దొడ్డు వడ్లు సాగు చేస్తుండన్నారు. సీఎం కవిూషన్లకు ఎగబడ్డడన్నారు. రైతుల బతుకులను బ్రోకర్ల చేతిలో పెట్టిండన్నారు. రాష్ట్రంలో సమన్వయ సమితులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏడేండ్ల నుంచి సీఎం ఏం చేశాడని ప్రశ్నించారు. రైతుల వడ్లను కేంద్రమే పక్కా కొంటుందన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వనని కేసీఆర్ కేంద్రానికి లెటర్ రాసిచ్చాడన్నారు. రైతులను ఆదుకోవడానికి కేంద్రం మద్ధతు ధర పెంచిందన్నారు. రైతులకు భయపడే కేసీఆర్ ఢల్లీిలో ధర్నా చేస్తుండన్నారు. రైతుల వడ్లు కొనే వరకు కేసీఆర్ ను ఉరికిస్తామన్నారు. ఏ రాష్ట్రంలో లేని వడ్ల పంచాయితీ తెలంగాణలో ఎందుకు వచ్చిందో కేసీఆర్ చెప్పాలన్నారు. చేతనైతే వడ్లు కొనాలని లేకపోతే కేసీఆర్ గద్దె దిగాలన్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఇసుక దందా ..భూదందా చేసిండని..ఇపుడు రైస్ దందా చేస్తున్నాడన్నారు. టీఆర్‌ఎస్ ను గద్దె దిగించేందుకు బీజేపీ నేతలు పూనుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ రైతుల నుంచి ధాన్యం కొనాలని, లేకుంటే గద్దె దిగాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. బీజేపీ రైతు దీక్షలో పాల్గొన్న ఆయన.. ముఖ్యమంత్రి పరిపాలనను వదిలేసి దద్దమ్మలా ఢల్లీిలో ధర్నా ఎందుకు చేస్తున్నారో చెప్పాలని అన్నారు. ధాన్యం విషయంలో దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని ఈటల ప్రశ్నించారు. తెలంగాణలో పీకే ఎª`లాన్స్ పనిచేయవన్న ఆయన.. ఇక్కడ కేవలం ఆత్మగౌరవమే పనిచేస్తుందని అన్నారు. ఐదారు వేల కోట్లతో పంట కొనలేని అసమర్థ సీఎం కేసీఆర్ అని విమర్శించారు. పీకే రాకతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందన్న ఈటల.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ కు పిచ్చి పట్టిందని అన్నారు. గవర్నర్ విషయంలో టీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే రైతులు బాగుపడతారని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్‌కు రైతులే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.స్పెషల్ ఫ్లైట్స్‌లో పక్క రాష్టాల్రకు తిరగడానికి డబ్బుంది కానీ.. పంట కొనడానికి కేసీఆర్ సర్కార్ దగ్గర డబ్బు లేదా? అని విజయశాంతి ప్రశ్నించారు.
5.కేంద్రం పాడిరదే పాట
` బాయిల్డ్‌రైస్‌కొనరట!
` ముడిబియ్యం మాత్రమే కొంటాం వెల్లడి
` టిఆర్‌ఎస్ ఢల్లీి సభపై కేంద్రం సమాధానం
న్యూఢల్లీి,ఏప్రిల్ 11(జనంసాక్షి):బాయిల్డైస్ర్ కొనలేమని, దానికి డిమాండ్ లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. దీనిపై గతంలోనే టిఆర్‌ఎస్ క ఊడా దీనిక కట్టుబడి లేఖ ఇచ్చిందని పునరుద్ఘాటించింది. ఢల్లీిలో టీఆర్ ఎస్ దీక్షపై కేంద్రం స్పందించింది. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. పారా బాయిల్డ్ రైస్‌ను కొనలేమని కేంద్రంమరోసారి స్పష్టం చేసింది. 2021`22 రబీ సీజన్ కు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం సేకరణ ప్రతిపాదనలు పంపలేదు. ప్రతిపాదనలు పంపాలని కేంద్రం అనేకసార్లు తెలంగాణను కోరింది. రబీ నుంచి ముడి బియ్యం సేకరణపై ప్రతిపాదనల కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాం అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పారా బాయిల్డ్ రైస్ ను మాత్రం సేకరించలేమని చేతులెత్తేసింది. భవిష్యత్తులో పారాబాయిల్డ్ రైస్ ను ఇవ్వమని తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. గత ఐదు ఆరు సంవత్సరాల నుండి తెలంగాణా నుండి కేంద్ర పూల్ కింద ధాన్యం సేకరణ అనూహ్యంగా పెరిగింది. రా రైస్ మాత్రమే ఎఫ్ సీఐకి ఇస్తామని 2020 21 సంవత్సరంలోనే తెలంగాణా రాతపూర్వకంగా రాసి ఇచ్చింది. భవిష్యత్తులో పార్ బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కూడా తెలంగాణా ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే భారత ఆహారసంస్థ వద్ద మరో మూడు ఏళ్ళకు సరిపడా పారా బాయిల్డ్ రైస్ నిల్వలు వున్నాయి. గత ఐదేళ్లలో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ గణనీయంగా పెంచామన్నారు. ఢల్లీి దీక్ష సందర్భంగా కేంద్రానికి సీఎం కేసీఆర్ 24 గంటల అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే.కాగా దేశంలో మొదటి నుంచి ఒకే ధాన్యం సేకరణ విధానం అమలులో వుందని కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధంశు పాండే పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా ఎలాంటి మార్పులు రాలేదన్నారు. ధాన్యం సేకరణపై గతంలో రాష్టాల్ర వివరాలు కోరామని ఆయన తెలిపారు. ఇంకా సేకరించాల్సిన బియ్యం ఉన్నాయన్నది అవాస్తవమని అన్నారు. ముందుగా ఇచ్చిన వివరాల మేరకే ధాన్యం సేకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎంత అవసరం ఉందో అంతే ధాన్యం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో గత ఐదేళ్లలో ఏడు రెట్ల ధాన్యం సేకరణ చేశామని తెలిపారు. ఖరీఫ్‌లో 68.7 ఎల్‌ఎంటీ ధాన్యం సేకరణ చేశామని సుధాంశు పాండే తెలిపారు. ఎఫ్‌సీఐ దగ్గర ఇప్పటికే 88.37 ఎల్‌ఎంటీ పారా బాయిల్డ్ రైస్ ఉందని ఆయన వెల్లడిరచారు. ఇందులో అత్యధికంగా తెలంగాణ నుంచే 40కి పైగా ఎల్‌ఎంటీ చేశామని చెప్పారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేవన్నారు.అన్ని రాష్టాల్ర నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ తగ్గించామన్నారు. అన్ని రాష్టాల్ర మాదిరిగానే తెలంగాణలో ధాన్యం సేకరిస్తామని ఆయన వెల్లడిరచారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం సంతకం పెట్టిందని ఆయన గుర్తు చేశారు.ధాన్యం సేకరణ, సంచుల అవసరంపై తెలంగాణ నుంచి ఎలాంటి ప్లాన్ అందలేదని అన్నారు. పంజాబ్ నుంచి పారా బాయిల్డ్ రైస్ తీసుకోలేదని సుధంశు పాండే స్పష్టం చేశారు.
6.నేడు తెలంగాణ కేబినేట్ భేటి
` ప్రగతి భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
హైదరాబాద్,ఏప్రిల్ 11(జనంసాక్షి): నేడు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. గత పదిరోజులుగా ఢల్లీిలోనే మకాం వేసిన కెసిఆర్ ఇక్కడి నుంచి పలు అంశాలను చర్చించారు. ధర్నాఅనంతరం హైదరాబాద్ బయలుదేరారు. తాజా పరిణామాలు ఇతర అంశాలు కేబినేట్‌లో చర్చకురానున్నాయి.
7.విద్వేషాలు,హింస దేశాన్ని బలహీనపరుస్తాయి: రాహుల్
న్యూఢల్లీి,ఏప్రిల్ 11(జనంసాక్షి):విద్వేషాలు, హింస దేశాన్ని బలహీనం చేస్తాయని సోమవారం కాంగ్రెస్ నేత రాహల్‌గాంధీ పేర్కొన్నారు. నిష్పాక్షిక, సంఘటిత భారత్‌ను కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. రామనవమి సందర్భంగా గుజరాత్‌లోని హిమాయత్ నగర్, ఖంబాత్‌లలో రెండు కమ్యూనిటీల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఒకరు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. జెఎన్‌యులో మాంసాహారం వండకూడదంటూ ఎబివిపి విద్యార్థులు మెస్ సిబ్బంది, విద్యార్థులపై దాడికి దిగన ఘటనలో 16 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ రెండు ఘటనలపై రాహుల్ ట్విటర్‌లో స్పందించారు. విద్వేషం, హింస, వివక్షలు మన ప్రియమైన దేశాన్ని బలహీనం చేస్తాయని అన్నారు. సౌభ్రాతృత్వం, శాంతి, సామరస్యం అనే ఇటుకలతో ప్రగతికి బాటలు వేయబడ్డాయని, అటువంటి నిష్పాక్షిక, సంఘటిత భారత్‌ను కాపాడుకునేందుకు ఐక్యంగా ఉండాలని రాహుల్ ట్వీట్ చేశారు.
ALL NEWS