నేడు ప్రధాని కాశ్మీర్‌ పర్యటన


` కొనసాగుతున్న ఎదురుకాల్పులు` మిలిటెంట్‌ హతం

శ్రీనగర్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): నేడు ప్రధాని మోదీ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇదిలాఉండగా దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బలగాల కాల్పుల్లో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న పాక్‌ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతుందని కశ్మీర్‌ పోలీసులు తెలిపారు. జిల్లాల్లోని మిర్హామా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు సీఆర్‌పీఎఫ్‌, జమ్మూ కశ్మీర్‌ పోలీసుల సంయుక్త బృందం సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించింది. ఈ క్రమంలోనే బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో బలగాలు ప్రతిగా కాల్పులు జరుపడంతో ఉగ్రవాది హతమయ్యాడు.