` కేంద్ర సర్కారు సంచలన నిర్ణయం
దిల్లీ,ఏప్రిల్ 13(జనంసాక్షి): దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటా సీట్లపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) కీలక నిర్ణయం తీసుకుంది.కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై పార్లమెంటు సభ్యుల (ఎంపీల) కోటా కింద కేటాయించే ప్రత్యేక సీట్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఒక్కో ఎంపీకి ఏటా 10 సీట్లను కేవీఎస్ కేటాయిస్తూ వస్తోంది. అయితే, ఈ కోటా పెంచాలని గత కొంతకాలంగా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు ఎంపీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ.. ప్రత్యేక కోటాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.
.కేంద్రీయ విద్యలయాల్లో ఎంపీల ప్రత్యేకకోటా రద్దు