1.బుద్ధుడు చూపిన మార్గం ప్రపంచానికి ఆదర్శం
` శాంతి,సహనం,అహింసా మార్గాలు నేటికీ అనుసరనీయమైనవి
` తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధానకేంద్రం
` బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లనుంది
` గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో బౌద్ధం పరిఢవిల్లింది
` గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ వెల్లడి
హైదరాబాద్,మే16(జనంసాక్షి):గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుద్ధుని బోధనలను స్మరించుకున్నారు. ప్రపంచ మానవాళికి బుద్దుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయమైనవని సిఎం అన్నారు.తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధానకేంద్రంగా వుందన్నారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో బౌద్ధం పరిఢవిల్లిందని సీఎం పేర్కొన్నారు. కృష్ణానది వొడ్డున ప్రకృతి రమణీయతల నడుమ అన్ని హంగులతో నాగార్జున సాగర్ లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న బుద్ధవనం’ బౌద్ధ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించి జాతికి అంకితం చేసిందని సిఎం కేసీఆర్ అన్నారు. బుద్ధుని జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లనున్నదన్నారు. సర్వ జన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవనాలతో కూడిన ప్రగతి దిశగా గౌతమ బుద్ధుని మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు.
2.ప్రజల మధ్య విభజన తెచ్చి దేశాన్ని చీల్చాలని చూస్తున్నారు
` ఆర్ధికవ్యవస్థను మోదీ సర్కారు సర్వనాశం చేసింది
` దేశాన్ని రెండువర్గాలుగా విభజిస్తున్న ప్రధాని
` పేదుల,దనవంతుల మధ్య పెరుగుతున్న అంతరం
` పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే పనిచేస్తున్న ప్రభుత్వం
` మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థ దారుణం
` రాజస్థాన్ పర్యటనలో రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢల్లీి,మే16(జనంసాక్షి): దేశాన్ని విభజించాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్తలకు ఒక దేశం, పేదలు అణగారిణ వర్గాలతో కూడిన మరో దేశాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని రెండుగా మార్చుతు న్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హిందుస్థాన్ ధనిక, పేద అనే దేశాలుగా మారి పోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అందరినీ కలుపుకొంటూ వెళ్తుంటే.. భాజపా ప్రజలను విభజిస్తోందని ఆరోపించారు. ఆదివాసీల ప్రాబల్యం అధికంగా ఉండే దక్షిణ రాజస్థాన్‌లోని బంస్వారా ప్రాంతంలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. భాజపాపై విమర్శలు గుప్పించారు. రెండు భిన్నమైన భావజాలాల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. మోదీ రెండు భారత దేశాలను తయారు చేయాలని అనుకుంటున్నారు. దళితులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాలకు ఒక దేశాన్ని.. ఇద్దరు` ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసం మరో దేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ మాత్రం ఒకే భారత్‌ను కోరుకుంటోంది. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలనే కాంగ్రెస్ చెబుతుంది. అణచివేయడం, విభజించడం, చరిత్రను ఏమార్చేందుకు ప్రయత్నించడం, ఆదివాసీల సంస్కృతిని నాశనం చేయడమే భాజపా చేసే పని. మేం పేద ప్రజలకు అండగా ఉంటే.. వారు కొందరు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం బలంగా తీర్చిదిద్దిన భారత ఆర్థిక వ్యవస్థను మోదీ ధ్వంసం చేస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. ’భాజపా ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. నోట్లరద్దు పరిణామాలు, జీఎస్టీని సరిగా అమలు చేయకపోవడం వంటి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా మారేందుకు యూపీఏ ప్రభుత్వం పనిచేసింది. నరేంద్ర మోదీ మాత్రం ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తున్నారు. తమకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదని దేశంలో యువత భావిస్తోంది. ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరుగుతోందని రాహుల్ విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం మూడు చట్టాలను తీసుకొచ్చిందన్న రాహుల్.. అన్నదాతల నిరసనలకు తలొగ్గి వెనక్కి తీసుకుందని అన్నారు. ఆ చట్టాల వల్ల ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకే ప్రయోజనం కలిగేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలతో ఎంతో కాలం నుంచి లోతైన అనుబంధం ఉందని రాహుల్ చెప్పుకొచ్చారు. ’విూ చరిత్రను గౌరవిస్తాం. దాన్ని సంరక్షిస్తాం. యూపీఏ పాలనలో చారిత్రక చట్టాలను తీసుకొచ్చి ఆదివాసీల అడవులు, నీటివనరులను సంరక్షించాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. రైతులు, దళితులు, ఆదివాసీలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అశోక్ గహ్లోత్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.ఇదే సభలో మాట్లాడిన గహ్లోత్.. దేశంలో ఆందోళనకర పరిస్థితి ఉందని.. శాంతి భద్రతలు ఉంటేనే దేశం పురోగతి సాధిస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్ పనిచేస్తూ వచ్చిందని.. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ దేశానికి ప్రయోజనం కలిగేలా ఉంటాయని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తే బీజేపీ దానిని పూర్తిగా బలహీనపరిచిందని అన్నారు.
3.నేపాల్,భారత్ బంధం బలమైనది
` ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది ఓ సమాధానం
` ఇరుదేశాల సంబంధాలు ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగాలి
` భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం
` సాంస్కృతిక, విద్యా రంగాల్లో ఆరు అవగాహన ఒప్పందాలు
ఖాట్మండూ,మే16(జనంసాక్షి):భారత్`నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఇరుదేశాల బంధం చాలా కీలకమని వ్యాఖ్యానించారు. బుద్ధుడి పట్ల ఆరాధన ఇరుదేశాల ప్రజలను అనుసంధానిస్తూ ఒకే కుటుంబంగా మారుస్తోందని పేర్కొన్నారు. బుద్ధుడు జన్మించిన నేలపై ఉన్న శక్తి ఉత్తేజకరంగా ఉందన్న మోదీ.. ఇది విభిన్న అనుభూతిని పంచుతోందన్నారు. 2014లో లుంబినిలో నాటేందుకు తాను పంపించిన మహాబోధి మొక్క ఇప్పుడు చెట్టుగా మారిందని పేర్కొన్నారు.’బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడు. ఆయన అందరివాడు. రాముడికి సైతం నేపాల్‌తో బంధం ఉంది. నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం. బుద్ధుడే మనల్ని కలుపుతున్నాడు. ఒకే కుటుంబంగా మార్చుతున్నాడు. ఇరుదేశాల సంబంధాలను నేపాల్‌లోని ఎత్తయిన పర్వతాల స్థాయికి చేర్చాలి. పండగలు, సంస్కృతులు, కుటుంబ సంబంధాలు.. ఇలా ఇరుదేశాల మధ్య వేల సంవత్సరాలుగా బంధం కొనసాగుతోంది. వీటిని మనం శాస్త్ర, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాలకు విస్తరించాలి’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.ఒకరోజు పర్యటనలో భాగంగా మోదీ సోమవారం నేపాల్‌కు వెళ్లారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవీ ఆలయాన్ని సందర్శించారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బాతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవ్‌బా, మోదీ లుంబినిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ మేరకు సాంస్కృతిక, విద్యా రంగాల్లో ఆరు అవగాహనల ఒప్పందాలు చేసుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్, లుంబిని బుద్ధిస్ట్ యూనివర్సిటీ, త్రిభువన్ విశ్వవిద్యాలయాలకు సంబంధించి వివిధ ఒప్పందాలు జరిగాయి.
4.భాజపా బుల్డోజర్లపాలన అతిపెద్ద వినాశనం కానుంది
` కేజ్రీవాల్ ఫైర్
దిల్లీ,మే16(జనంసాక్షి):దేశ రాజధాని దిల్లీలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ధ్వజమెత్తారు.దిల్లీలో 80శాతం కట్టడాలు ఆక్రమణలే అన్న ఆయన.. వాటన్నింటినీ కూల్చేస్తే దేశంలోనే అతిపెద్ద విధ్వంసం ఇదే అవుతుందని భాజపాపై మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.’’దుకాణాలు, ఇళ్లను కూల్చివేసేందుకు వారు(భాజపా నేతృత్వంలోని మున్సిపల్ కార్పొరేషన్లను ఉద్దేశిస్తూ) బుల్డోజర్లతో కాలనీలకు వస్తున్నారు. కనీసం ఎలాంటి పత్రాలు చెక్ చేయకుండా నిర్మాణాలను కూల్చేస్తున్నారు. దిల్లీని ఓ ప్రణాళిక ప్రకారం నిర్మించలేదు. ఇక్కడ 80 శాతానికి పైగా ఉన్న కట్టడాలు ఆక్రమణలే అని చెప్పొచ్చు. దానర్థం 80శాతం దిల్లీని విూరు ధ్వంసం చేయబోతున్నారా? అక్రమ కట్టడాల కూల్చివేతల్లో మున్సిపల్ అధికారులు చేపడుతున్న చర్యలు సరికాదు. దాదాపు 50లక్షల మంది ప్రజలు అనధికారిక కాలనీల్లో, 10లక్షల మంది జుగ్గీల్లో నివాసముంటున్నారు. అంటే 60లక్షలకు పైగా ప్రజల ఇళ్లు, దుకాణాలను విూరు బుల్డోజర్లతో కూల్చేయనున్నారా? అదే జరిగితే స్వతంత్ర భారతంలో ఇదే అతి పెద్ద వినాశనం కానుంది’’ అని కేజ్రీవాల్ భాజపాపై మండిపడ్డారు.భాజపా కక్షపూరితంగా చేస్తోన్న ఈ అక్రమ కట్టడాల కూల్చివేతను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లేందుకు కూడా వెనుకాడొద్దని చెప్పారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ కచ్చితంగా విజయం సాధిస్తుందని, అప్పుడు ఈ ఆక్రమణల సమస్యను పరిష్కరిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. అనధికారిక కాలనీల్లో ఉంటున్న వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని హావిూ ఇచ్చారు.
6.తెలంగాణకు వర్షసూచన!
తగ్గుముఖం పడుతున్న ఉష్ణగాలులు..
హైదరాబాద్,మే16(జనంసాక్షి):బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించాయి. సముద్ర ఉష్ణోగ్రతలతో పాటు ఇతర వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.ప్రస్తుతానికి బంగాళాఖాతంలోని దక్షిణ ప్రాంతాలతో పాటు అండమాన్ దీవులు, శ్రీలంక పరిసర ప్రాంతాలకూ రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ తెలిపింది.మరోవైపు రుతుపవనాల ప్రవేశానికంటే ముందుగా కేరళ, దక్షిణ కర్ణాటకలోని తీరప్రాంతాల్లో రాగల 4`5 రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రుతుపవనాల ఆగమనంతో పశ్చిమ వాయవ్య, మధ్య భారత్‌పై ఉష్ణగాలుల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టినట్టు ఐఎండీ తెలిపింది. రాగల 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, తెలంగాణ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడిరచింది. మరోవైపు విధర్భ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉష్ణగాలుల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది. అందుకే ఆయా ప్రాంతాల్లో తీవ్రస్థాయిలోనే ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయని ఐఎండీ పేర్కొంది.
7.21 నుంచి ‘రైతు రచ్చబండ’
` తెలంగాణలో పాదయాత్ర చేయాలని రాహుల్‌ను కోరదాం
` ఈ ఒక్క ఏడాది కష్టపడితే కాంగ్రెస్‌దే అధికారం
` కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
హైదరాబాద్,మే16(జనంసాక్షి): రైతు సంఘర్షణ సభ, వరంగల్ డిక్లరేషన్‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.అందరి కృషితోనే సభ విజయవంతమైందని చెప్పారు. గాంధీభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన చింతన్ శిబిర్‌లో తీసుకున్న అన్ని అంశాలను ఈ సమావేశంలో ఆమోదిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశామని.. దీన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపాలని నిర్ణయించామన్నారు.సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తిచేశామని.. కాంగ్రెస్ సభ్యులకు ప్రమాద బీమా చేయించామని రేవంత్ చెప్పారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే వెంటనే గాంధీభవన్‌లోని కార్యాలయంలో తెలపాలని సూచించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను జనంలోకి తీసుకెళ్లాలన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మే 21 నుంచి నెలరోజులపాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతు రచ్చబండ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో రైతులతో చర్చించాలని.. 30 రోజుల పాటు దీన్ని నిర్వహించాలని సూచించారు. ముఖ్యనేతలంతా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను వరంగల్ జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామంలో రచ్చబండ సభలో పాల్గొంటానని రేవంత్ చెప్పారు.అక్టోబర్ 2 నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరగనుందన్నారు. రాహుల్ గాంధీ పాల్గొనే పాదయాత్ర మొదట తెలంగాణలో చేపట్టాలని ఆయన్ను కోరదామని చెప్పారు. రాష్ట్రంలో 100 కి.విూ. ఆయన పాల్గొనేలా చూద్దామని రేవంత్ అన్నారు. డిజిటల్ మెంబర్‌షిప్, వరంగల్ డిక్లరేషన్‌కు తెలంగాణ మోడల్ అని పేరొచ్చిందని.. రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా రాష్ట్రంలో చేపట్టి హ్యాట్రిక్ కొడదామన్నారు. అందరి కష్టంతో ఇవన్నీ సాధించామని.. ఈ ఒక్క ఏడాది కష్టపడితే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందని రేవంత్ దిశానిర్దేశం చేశారు.
8.ఐటిలో మన పోటీ సింగపూర్‌తో..
మంత్రికెటిఆర్ వెల్లడి
హైదరాబాద్,మే16(జనంసాక్షి):తెలంగాణకు పోటీ బెంగళూరుతో కాదని.. సింగపూర్, మలేసియా దేశాలతో అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో అద్భుతమైన ఇన్‌ఫ్రాస్టక్చర్ర్ ఉందని తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గంలో కొలియర్స్, ష్యూర్గిª సంస్థల నూతన కార్యాలయాలను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. భాగ్యగనరంలో కొవిడ్ వల్ల హైబ్రిడ్ విధానంలో పనిచేస్తున్నా.. ఫలితాలు మాత్రం ఎక్కడా తగ్గట్లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ కార్యకలాపాలు హైదరాబాద్‌కే పరిమితం కాదని.. టైర్`2 సిటీలో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాయదుర్గంలోని మైహోం ట్విట్జాలో కొలియర్స్, ష్యూర్గిసంస్థల కార్యాలయాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
9.అకాల వర్షం..అపారనష్టం
` పలుప్రాంతాల్లో తడిసి ముద్దయిన పంట
` పంటనష్టంపై మంత్రికేటీఆర్ ఆరా..
హైదరాబాద్,మే16(జనంసాక్షి):ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు జగిత్యాల, మెదక్, నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్ జిల్లాల్లో అన్నదాతలు అతలాకుతలం అయ్యారు. పలు మండలాలతో గ్రామాల్లో భారీ వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది., మొక్కజొన్న, సజ్జ, నువ్వు, మామిడి పంటలు నేలవాలాయి. అకాల వర్షాలతో ఏమి చేయలేని రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండడంతో ధాన్యం కుప్పలు వరదనీటిలో మునిగిపోయాయి. వరద నీరు ధాన్యం. కుప్పల వద్దకు చెరి ధాన్యాన్ని నీట ముంచాయి. మరోవైపు పంట పొలాలలో వేసిన నువ్వు, మొక్కజొన్న పంటలు నెలకొరిగాయి. కొన్ని చోట్ల పట్టణాల్లో భారీ చెట్లు విరిగి రోడ్లపై, విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం ఉందని, ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు మరో రెండు రోజులపాటు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. మరో రెండు రోజులు ద్రోణి ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే ఎండల తీవ్రత తగ్గిపోయి..సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్యాహ్నం నుండి ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు, తేలికపాటి జల్లులు కురిశాయి. కుబ్దుల్లా పూర్ లో 3.6 సెంటివిూటరేజ్ మోస్తరు వర్షం నమోదయింది.ఈదురు గాలులతో కూడిన వర్షంతో జగిత్యాల జిల్లాలో అన్నదాతలు అతలాకుతలమయ్యారు.మెట్‌పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో మొక్కజొన్న, సజ్జ, మామిడిపంటలు నేలరాలాయి. సారంగపూర్, బీర్పూర్, రాయికల్, జగిత్యాల మండలాల్లో ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జరిగిన నష్టంపై రైతులతో మాట్లాడారు.నిజామాబాద్, డిచ్‌పల్లి, ఆర్మూర్, ఎడపల్లి, భీంగల్, జక్రాన్ పల్లి, సిరికొండ, ఇందల్వాయి, ధర్పల్లి, బాల్కొండ, రుద్రూర్, నవీపేట్ మండలాల్లో వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడపగల్, లింగంపేట్, బీబీపేట్, గాంధారి, కామారెడ్డి మండలాల్లో కురిసిన వర్షానికి కోతకు సిద్ధంగా ఉన్న వరితో పాటు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నీటిలో మునిగింది.కాగా సిరిసిల్ల జిల్లాలో వర్షాలతో నష్టపోయిన పంట వివరాలపై కేటీఆర్ ఆరా తీశారు. వర్షానికి తడిసిన ధాన్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నష్టం వివరాలను కేటీఆర్‌కు కలెక్టర్ వివరించారు.ఇదిలావుండగా వర్షాకాలం ప్రవేశిస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి ధాన్యం సేకరణ చేపట్టలేదని కాంగ్రెస్ విమర్శించింది. టీఆర్‌ఎస్ తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసిందేమిలేదని టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ విమర్శించారు.ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అసలు ధాన్యం కొనుగోళ్లలో ఎందుకు ఆలస్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కల్లాల్లల్లో ఉన్నప్పుడు ఎందుకు టార్పాలిన్ కవర్లు సిద్ధం చెయలేదని నిలదీశారు. ఈ వారంలో వర్షాలు పడతాయని తెలిసినా ఇంతగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తడిసిన ధాన్యంతో ఒకవైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ లో కూర్చోని చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
10.ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
రైతువేదికల ద్వారా అవగాహన కల్పించాలి
అధికారులకు సూచించిన మంత్రి నిరంజన్ రెడ్డి
సూర్యాపేట,మే16(జనంసాక్షి):జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంపై రైతు వేదికల ద్వారా రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డితో కలసి ప్రత్యామ్నాయ పంట సాగు విధానంపై సవిూక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంట సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆదిశగా అధికారులు నిరంతరం ప్రత్యేక కృషిచేయాలని సూచించారు. జిల్లాలో పెరుగిన నీటి వనరులు ఆధారంగా ఈ వనాకాలంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో 561 ఎకరాలలో ఉద్యాన పంటలు రైతులు సాగు చేస్తున్నారని రాబోవు సంవత్సరాలలో రైతులు మరింత ఉద్యాన సాగు చేసేలా కృషి చేయాలని అన్నారు. ముఖ్యనీగా పంటల సాగు విధానంపై అన్ని క్లస్టర్లలో ఉన్న రైతు వేదికల ద్వారా వ్యవసాయ, ఉద్యాన అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ªుల్లాలో వేరుశెనగ, కందులు, అరటి, నిమ్మజాతి అలాగే టిష్యు కల్చర్ సాగును ఎక్కువగా పెంచాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలోని పంట సాగుకు ఉత్సాహం చూపే రైతులను మహారాష్ట్ర లోని జలగావ్ సందర్శన టూర్ తీసుకొని వెళ్లాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తో కలసి పంట సాగు పై క్లస్టర్ వారీగా సవిూక్షించారు. సమావేశంలో డి.ఏ. ఓ రామారావు నాయక్, డి.హెచ్.యస్. శ్రీధర్ గౌడ్, ఏ. డి.ఎ, ఏ. ఓ లు తదితరులు పాల్గొన్నారు.
11. అమెరికాలో మరోసారి కాల్పుల మోత
` వరుస ఘటనలతో ప్రజల్లో భయాందోళన
` హ్యూస్టన్ కాల్పుల్లో ఇద్దరు మృతి
న్యూయార్క్,మే16(జనంసాక్షి):అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన మరవక ముందే మరో రెండు ప్రాంతాల్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికాలోని హ్యుస్టన్ మార్కెట్‌లో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బహిరంగ మార్కెట్‌లో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణమే కాల్పులకు దారి తీసిందని పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారిద్దరి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాల్పులు జరిపినవారు, గాయపడ్డవారు అందరూ 20 ఏండ్లలోపు వారని పోలీసులు తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటన కేసులో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమెరికాలో 18 ఏండ్ల శ్వేత జాతి యువకుడు నల్లజాతీయులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోరానికి పాల్పడుతున్న సమయంలో నిందితుడు లైవ్ స్ట్రీమింగ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్‌లో ఈ దారుణం జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
12.చైనా సరిహద్దులకు ఆరు సైనిక డివిజన్లను తరలించిన భారత్..!
న్యూఢల్లీి,మే16(జనంసాక్షి):వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సరిహద్దుల్లో వివాదం ఇప్పట్లో తగ్గేట్లు లేకపోవడంతో భారత్ కీలక చర్యలు తీసుకొంది.పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వైపు నుంచి ఆరు డివిజన్లను లద్దాఖ్ సెక్టార్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మోహరించింది. గతంలో భారత సైన్యం పాక్ వైపు నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేది. కానీ, ఇప్పుడు చైనా నుంచి వచ్చే ముప్పును అడ్డుకోవడానికి తొలి ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో దళాల మోహరింపుల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకొంటున్నాయి. ఆర్మీచీఫ్‌గా మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల లద్దాఖ్‌లో పర్యటించి దళాల మోహరింపును సవిూక్షించారు. చైనాతో సరిహద్దు వివాదం మొదలై దాదాపు రెండేళ్లు పూర్తౌెనా ఇంత వరకూ ఓ కొలిక్కి రాలేదు.తాజా మార్పుల్లో భాగంగా జమ్ము`కశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాలను అణచి వేసే రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ డివిజన్‌ను తూర్పు లద్ధాఖ్ ప్రాంతానికి పంపించారు. ఇప్పటికే మూడు డివిజన్‌లు అక్కడ విధులు నిర్వహిస్తున్నాయి. హరియాణలోని స్ట్రైక్ కోర్ నుంచి ఒక డివిజన్‌ను ఉత్తరాఖండ్‌కు తరలించారు. వన్ స్ట్రైక్ కోర్‌కు చెందిన మరో రెండు డివిజన్లు కూడా లద్దాఖ్‌కు వెళ్లాయి. గతంలో ఇవి పాక్ సరిహద్దుల్లో విధులు నిర్వహించేవి. దీంతోపాటు 17 మౌంటెన్ స్ట్రైక్ కోర్‌కు రaార్ఖండ్ నుంచి ఒక డివిజన్‌ను పంపించారు. అస్సాంలో మరో డివిజన్‌కు చైనా సరిహద్దుల బాధ్యతలు అప్పగించారు.