1.హైదరాబాద్‌కు కేంద్రం దగా..
` ఐటీఐఆర్‌ను రద్దు చేశారట
` నిండు సభలో కేంద్రం ప్రకటన
` ఇది సిగ్గుచేటు..మండిపడ్డ మంత్రి కేటీఆర్
` కుంచిత రాజకీయాల చేయడం కోసమే ఈ చర్య
` బీజేపీ డీఎన్‌ఏలో అసత్యాలు, అవాస్తవాలు
` తెలంగాణకు శనిలా దాపురించిన మోదీ..
` హైదరాబాద్ ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఏదీ..?
` అన్యాయంపై దుమ్మెత్తిపోస్తున్నా మోదీలో చలనం రావడం లేదు..
` యువత ఉపాధి విషయంలో కేంద్రానికి ముందుచూపేది?
` ఎనిమిదేళ్లలో తెలంగాణకు జరిగిన నష్టంపై వివరణ ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్(జనంసాక్షి):సకుంచిత రాజకీయాల కోసమే కేంద్రం ఐటీఐఆర్ రద్దు చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఐటీఐఆర్ స్థాయిలో రాష్టాన్రికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్‌లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ డీఎన్‌ఏలో నిండి ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలను ఎప్పటిలాగే అలవోకగా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వల్లె వేశారని కేటీఆర్ విమర్శించారు. రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి.. మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టు రద్దుతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింత ఎదిగే అవకాశాన్ని కోల్పోయిందన్న కేటీఆర్, ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ పరిశ్రమ సాధిస్తున్న ప్రగతికి కేంద్రం చేసింది ఏవిూ లేదన్నారు.ఐటీఐఆర్ రద్దుతో ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో తెలంగాణకు జరిగిన నష్టంపై వివరణ ఇవ్వాలని కేటీఆర్ ఇమాండ్ చేశారు. కేంద్రంలోని వివిధ శాఖలు ప్రవేశ పెట్టిన స్మార్ట్ సిటీ, ఇండస్టియ్రల్ కారిడార్లను తెలంగాణకు మంజూరు చేసినందుకే ఐటీఐఆర్‌ను రద్దు చేశామని కేంద్రం చెప్పడం వారి ఇంటలెక్చువల్ బ్యాంకురప్టసీకి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. కనీసం ఐటీఐఅర్ రద్దుకు కేంద్రం పెర్కొంటున్న అయా పథకాల్లలోనూ తెలంగాణకి దక్కింది ఏం లేదన్నారు. ఐటీ పరిశ్రమ బలోపేతం కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకాన్ని ఇతర రంగాల్లోని కార్యక్రమాలను చూపి రద్దు చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికున్న విధానపరమైన నిబద్ధతకు నిదర్శనమని ఎద్దేశా చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కు లెక్కలేనన్నీ కేంద్ర పథకాలను మంజూరు చేసుకుంటూ, తెలంగాణకు వస్తున్న చారానా, ఆఠానా మందం పనులను కూడా సాకుగా చూపెట్టడం దారుణమన్నారు. ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నా యంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు మోదీ ప్రభుత్వం ఇచ్చిందేంటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 2008 లో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదన చేసి, 2013లో దానికి ఆమోదం తెలిపినా, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తెలంగాణకు శనిలా దాపురించిన మోదీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విభజన హవిూల మాదిరె హైదరాబాద్ ఐటీఐఆర్‌ను కూడా మూలకుపెట్టిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తాను కూడా వివిధ సందర్భాల్లో ఢల్లీి వెళ్లి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను ఐటీఐఆర్ గురించి అడిగామన్న కేటీఆర్, ఎన్నిసార్లు కోరినా తోలుమందం కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు. మోడీ ప్రభుత్వ నిష్కియ్రా పరత్వాన్ని గుర్తించినంకనే ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమానస్థాయిలో హైదరాబాద్ ఐటీకి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50సార్లు కేంద్రాన్ని కోరమన్నారు. అయినా కూడా మోదీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీ ఈకో సిస్టమ్‌కు నయా పైసా మందం సహాయం చేయలేదని కేటీఆర్ విమర్శించారు. కేంద్రానికి హైదరాబాద్ ఐటీ పరిశ్రమ అభివృద్ధిపైన చిత్తశుద్ధి లేకనే, ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయం చూపలేదని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలైన నోట్ల రద్దు, కరోనా లాక్ డౌన్, పాలసీ పారలసిస్‌లతో ఏర్పడ్డ ఆర్థిక, సామాజిక సంక్షోభంలోనూ దేశ సగటును మించిన అద్భుతమైన ప్రగతిని తెలంగాణ ఐటీ పరిశ్రమ సాధించిందన్నారు. ఒకవేళ ఐటీఐఆర్ ప్రాజెక్టు కనుకే ఉండి ఉంటే ఈ ఏడు సంవత్సరాల్లో హైదరాబాద్ ఐటీ ఎకో సిస్టం ఆకాశమే హద్దుగా అద్భుతంగా ఎదిగేదన్నారు.హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టుకు తాము చేస్తున్న ధోఖాను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ గల్లీ లీడర్లు పూటకో మాట మాట్లాడి ఇన్ని రోజులు పబ్బం గడుపుకున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న మోదీ ప్రభుత్వం, రాజకీయంగా తమకు ప్రయోజనం కాదన్న ఏకైక కారణంతోనే ఐటీఐఆర్‌ను రద్దుచేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఆధునిక భారత్ ను నిర్మించడంపై తమకున్న విధానపర అశక్తతను పార్లమెంట్‌లో ఒప్పుకుని తెలంగాణ ఐటీ గ్రాడ్యుయేట్లు, వృత్తి నిపుణులు, యువతకు మోదీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ఇక్కడి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నా.. ప్రధాని మోదీలో చలనం రావడం లేదని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పురోగమిస్తున్న తెలంగాణ ఐటీ రంగ ప్రగతిని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వ నికృష్ట రాజకీయానికి ఈ మధ్యనే ప్రకటించిన సాప్ట్ వేర్ పార్కులే సాక్ష్యం అన్నారు.ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళ రాష్టాల్రకు సాప్ట్ వేర్ పార్క్‌లను కేటాయించిన కేంద్రం, తెలంగాణకు మరోసారి అన్యాయం చేసిందన్నారు. ఈ విషయంలోనూ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేదన్నారు. దేశవ్యాప్తంగా 22 సాప్ట్‌వేర్ పార్కులను ప్రకటిచించి తెలంగాణకు మెండిచేయి చూపడం బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిన్నచూపునకు నిదర్శనమన్నారు. ఒకవైపు ఐటీఐఆర్, సాప్ట్‌వేర్ పార్కుల్లో తెలంగాణకు స్థానం ఇవ్వని కేంద్రం, తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ టీ హాబ్ `2 నిర్మాణాన్ని రూ.450 కోట్లతో పూర్తి చేస్తే, దానికి కేంద్రం నుంచి పైసా సహాయం లేదన్నారు. యువతకు ఉపాధి కల్పించే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముందుచూపు లేదని, యువతకు ఉపాధి కల్పణ, శిక్షణ రంగాల్లో కేంద్రం విఫలం అయిన విషయాన్ని దేశంలోని యువత, నిరుద్యోగులు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఇలా తెలంగాణ ఐటీ రంగంతోపాటు, అన్ని అంశాల్లో రాష్టాన్రికి అన్యాయం చేస్తున్న కేంద్రం విధానాలను ఇక్కడి యువత గమనించాలని కోరారు. మరోపైపు కేంద్రం సంపూర్ణ సహాయ నిరాకరణ, వివక్ష చూపుతున్న ఉపాధి కల్పనలో తెలంగాణ ముందువరుసలో ఉన్న విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటికైనా దేశ ఐటీ రంగానికి దిక్సూచిగా ఎదుగుతున్న తెలంగాణ ఐటీ రంగానికి కేంద్రం ప్రత్యేకంగా ఐటీఐఆర్‌కు సమానంగా ఒక పథకాన్ని లేదా ప్యాకేజీని ప్రకటించి తెలంగాణ పట్ల తమ నిబద్దత చాటుకోవాలని కేటీఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింతగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయిందన్నారు. యువతకు ఉపాధి కల్పించే విషయంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి ముందుచూపు లేదన్న కేటీఆర్... ఉపాధికల్పన, శిక్షణారంగాల్లో కేంద్రం విఫలమైన విషయాన్ని దేశంలోని యువత, నిరుద్యోగులు గమనిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా యువత మేలుకో... తెలంగాణ ఐటీరంగంతో పాటు అన్ని అంశాల్లోనూ రాష్టాన్రికి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఇక్కడి యువత గమనించాలని మంత్రి కోరారు. కేంద్రం సంపూర్ణ సహాయ నిరాకరణ, వివక్ష చూపుతున్నఉపాధి కల్పనలో తెలంగాణ ముందువరుసలో ఉన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికైనా దేశ ఐటీ రంగానికి దిక్సూచిగా ఎదుగుతున్న తెలంగాణ ఐటీ రంగానికి కేంద్రం ప్రత్యేకంగా ఐటీఐఆర్‌కు సమానంగా ఒక పథకాన్ని లేదా ప్యాకేజీ ప్రకటించి తెలంగాణ పట్ల తమ నిబద్దత చాటుకోవాలని కేటీఆర్ సూచించారు.
(మోడీ అసమర్థత వల్లే దేశీయంగా బొగ్గు కొరత
మరోమారు ట్విట్టర్ విదికగా కెటిఆర్ విమర్శలు
హైదరాబాద్(జనంసాక్షి):కాలికి గాయం కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై మరోసారి విరుచుకు పడ్డారు. మోదీ సర్కార్ ప్రణాళికా లోపంతో దేశీయంగా బొగ్గు కొరత ఏర్పడిరదని విమర్శించారు. మోదీకి ముందుచూపు లేకపోవడం వల్ల 10 రెట్లు ఎక్కువ విలువైన విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. తరచూ ట్విటర్‌లో కేంద్ర విధానాలను ఎండగట్టే మంత్రి.. విశ్రాంతి సమయంలోనూ కేంద్రంపై ట్వీట్ వార్ కొనసాగించారు. ట్విటర్ వేదికగా.. మరోసారి మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. బొగ్గు విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై వ్యంగ్యంగా స్పందించారు. మోదీ సర్కార్ ప్రణాళికా లోపం.. ముందుచూపు లేక దేశీయంగా బొగ్గు కొరత ఏర్పడిరదని కేటీఆర్ విమర్శించారు. దీంతో 10 రెట్లు ఎక్కువ విలువైన విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోక తప్పనిసరి పరిస్థితి నెలకొందన్నారు. బొగ్గు దిగుమతి చేసుకోవడంతో తదుపరి విద్యుత్ టారిఫ్ పెరుగుతుందన్న మంత్రి... ఇందుకు ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో తెలుసా అంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో దేశంలో మరో వందేళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడిరచారు.
2.జాతీయ రాజకీయాలపై అఖిలేష్‌తో కేసీఆర్ భేటి
` రెండు గంటలపాటు చర్చ
న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఢల్లీి టూర్‌లో భాగంగా ఆయన.. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో భేటీ ఆయ్యారు. బాబాయ్ శివపాల్ యాదవ్ తో కలిసి అఖిలేష్ కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఇరువురు నేతలకు ముఖ్యమంత్రి బొకే ఇచ్చి స్వాగతం పలికారు.సీఎం కేసీఆర్, అఖిలేష్ సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై ముగ్గురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు విపక్ష నేతలతో భేటీ అవుతున్నారు. గతంలో ఢల్లీి పర్యటన సందర్భంగా పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులతో భేటీ అయ్యారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో ఢల్లీి పర్యటనను మధ్యలోనే ముగించుకుని హైదరాబాద్ వచ్చారు.
3.జాతిగర్వించదగ్గకవి సినారె
` సినారె తెలుగు కీర్తి.. తెలుగు వారు గర్వించదగ్గ సాహితీ మూర్తి
` ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
` కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి
` ఒడియా రచయిత్రి ప్రతిభారాయ్‌కు సినారె జాతీయ సాహిత్య పురస్కారం ప్రదానం
హైదరాబాద్(జనంసాక్షి):యావత్ తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తుంచుకునే మహాకవి, తెలుగు కీర్తి, సాహితీ మూర్తి డాక్టర్ సి. నారాయణ రెడ్డి అని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాతృభాషను తాను ప్రేమిస్తూ తన రచనల్లో ఈ అభిమానాన్ని ప్రతిబింబించడంతోపాటుగా సమాజంలో మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన మహనీయుడు సినారె అని ఆయన పేర్కొన్నారు.శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో డాక్టర్ సి.నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ ఒడియా రచయిత్రి డాక్టర్ ప్రతిభారాయ్ కు ఉపరాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినారె కవిత్వం, సాహిత్యం ఎప్పుడూ మానవ జీవనం, తత్వం, ప్రకృతిని ప్రేమించడం తదితర అంశాల చుట్టూనే సాగాయన్నారు. వారికి జ్ఞానపీఠ్ అవార్డును తెచ్చిపెట్టిన ‘విశ్వంభర’, మానవుడికి, ప్రకృతికి ఉన్న సంబంధాన్ని మానవీయ భావనతో తెలిపే ఆలోచనాత్మక కావ్యమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇది ఆయన్ను రసోద్విగ్నుడిగా, శిల్ప భరతుడిగా విశ్వసాహితీ పీఠం పై నిలబెట్టిందన్నారు. రాజసం, ఠీవీ, గాంభీర్యం, లాలిత్యం, మాధుర్యం, శృంగారాల మేళవింపుగా శ్రీ సినారె రచనలు సాగాయన్న ఉపరాష్ట్రపతి, వారి రచనలు పాత తరానికి, కొత్త తరానికి వారధులు వేశాయని పేర్కొన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, సినిమా సాహిత్యానికి సైతం గౌరవాన్ని సంపాదించిపెట్టిన సినారె చిరస్మరణీయులని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా, ప్రభుత్వ భాషా సంస్కృతుల సలహాదారుగా, సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఆయన తన ప్రతి పదవికీ వన్నెతీసుకొచ్చారన్నారు. ‘‘ఋషిత్వానికి ` పశుత్వానికీ.... సంస్కృతికీ ? దుష్కృతికీ, స్వచ్ఛందతకూ .. నిర్బంధతకూ ` సమార్ధ్రతకూ .. రౌద్రతకూ తొలిబీజం మనసు, తులారూపం మనసు, మనసుకు తొడుగు మనిషి, మనిషికి ఉడుపు జగతి ఇదే విశ్వంభరాతత్త్వం ఇదే అనంత జీవిత సత్యం’’ అన్న విశ్వంభర కవితా పంక్తుల్ని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. దేనికైనా ముందుగా మనసు సిద్ధం చేసుకోవాలన్న సినారె వారి విశ్వంభర కవితా పంక్తులు, తన జీవనాన్ని ప్రతిబింబించాయన్న ఆయన, అందులోని కిటుకును తెలుసుకోగలిగితే ఎవరైనా, దేన్నైనా ఆనందంగా స్వీకరించగలరని పేర్కొన్నారు. కవితలు, సాహిత్యం, సినీగీతాల్లో తెలుగు భాషకు సినారె పెద్దపీట వేశారన్న ఉపరాష్ట్రపతి, తెలుగుదనానికి ఆయన నిలువెత్తు సంతకమని తెలిపారు. వారి ఆహార్యంతోపాటు మనసు కూడా ఎప్పుడూ మాతృభాష గురించి తపన పడుతూనే ఉండేదన్నారు. శ్రీ నారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యులుగా ప్రతిపాదించిన బిల్లులలో ప్రధానమైంది ‘మాతృభాష’ (నిర్బంధ బోధన ? అధ్యయనం) బిల్లు అని గుర్తుచేశారు. విద్యార్థి చదివే భాషల్లో మాతృభాష తప్పక ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేయాలని, భారత రాజ్యాంగం ‘8’వ షెడ్యూలులో పేర్కొన్న భాషలకు, దీనిని వర్తింపజేయాలని, నారాయణరెడ్డిగారు పట్టుబట్టిన విషయాన్నీ ఉపరాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ`2020) మాతృభాషకు ఇస్తున్న ప్రాధాన్యత నారాయణరెడ్డి ఆకాంక్షించినదేనన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ఇలాంటి విశిష్ట వ్యక్తిత్వమైన నారాయణ రెడ్డి కవితలు, సాహిత్యం, వారి జీవన విధానాన్ని, మాతృభాష పట్ల వారి అంకితభావాన్ని యువత అవగతం చేసుకోవాలన్నారు.సినారె జయంతి సందర్భంగా, వారి పేరిట ఏర్పాటు చేసిన డా. సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు సభ్యులకు, సి.నారాయణరెడ్డి గారి కుటుంబ సభ్యులను అభినందించారు. పురస్కార గ్రహీత డాక్టర్ ప్రతిభా రాయ్ కు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేశారు. మాతృభాషను అమితంగా ప్రేమించి తెలుగు సాహిత్యంలో జ్ఞాన్ పీఠ్ పురస్కారం పొందిన శ్రీ సి.నారాయణరెడ్డి పేరిట ఏర్పాటు చేసిన అవార్డును తన మాతృభాష అయిన ఒడియాను ప్రేమి మరో జ్ఞాన్ పీఠ్ పురస్కార గ్రహీత కు ఇవ్వడం అభినందించదగిన అంశమని ఆయన అన్నారు.కార్యక్రమం ప్రారంభంలో శ్రీమతి దీపికా రెడ్డి గారి బృందంచే మన మాతృభాష తెలుగు, అష్టవిధ శృంగార నాయికలు రూపకాలు ప్రేక్షకులను అలరించాయి.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీమతిసుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ కార్యదర్శి శ్రీ జె.చెన్నయ్య గారికి, అవార్డు గ్రహీత డా. ప్రతిభా రాయ్, ప్రముఖ రచయిత్రి ఓల్గా సహా సినారె గారి కుటుంబ సభ్యులు, అభిమానులు, పలువురు సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
4.పాలమూరు లిఫ్ట్ పనుల్లో ఘోరప్రమాదం
` క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురు కార్మికుల దుర్మరణం
` ఘటనాస్థలినిపరిశీలించిన అధికారుల బృందం
నాగర్‌కర్నూలు(జనంసాక్షి):జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్ స్కీం పనుల్లో విషాదం నెలకొంది. కొల్లాపూర్ మండలం రేగమనగడ్డ దగ్గర జరుగుతున్న లిప్ట్ ఇరిగేషన్ స్కీం పనుల్లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు. క్రేన్ సాయంతో పంప్ హౌస్ లోకి దిగుతుండగా వైర్ తెగిపోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహలను రాత్రే హైదరాబాద్ ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్య బృందం అభిజిత్ నేతృత్వంలో ఐదుగురు కార్మికుల మృతదేహాలకు పోస్ట్ మార్టం చేపట్టారు. ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు జార్ఖండ్‌కు చెందిన భోలేనాథ్ (45), ప్రవీణ్ (38), కమలేష్ (36 ), బీహార్ కు చెందిన సోను కుమార్ (36), ఆంధప్రదేశ్ కు చెందిన శ్రీను (40)గా గుర్తించారు. ఈ ఘటన పాలమూరు, రంగారెడ్డి ప్యాకేజీ `1లో జరిగింది. మరోవైపు జూన్ 10వ తేదీన పాలమూరు, రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్ పనులను నేషనల్ లేబర్ కమిషన్ చైర్మన్ పపరిశీలించారు. నిర్మాణ పనుల్లో రక్షణ చర్యలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా లోపాలపై ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. అయినా.. కాంట్రాక్టు ఏజెన్సీ, అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇవాళ ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలమూరు, రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనుల్లో క్రేన్ ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు మృతిచెందడం తీవ్ర దిగ్భార్రతి కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉపాధి కోసం ఇతర రాష్టాల్ర నుంచి వచ్చి ఇక్కడ చనిపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం జరగడానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందడం దిగ్భార్రతి కలిగించిందని టీ పీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
5.హైదరాబాద్‌ను వీడని వాన..
` నగరవాసుల అష్టకష్టాలు
` ఉరుములు, మెరుపులతో దంచికొట్టిన వాన
` పలు ప్రాంతాలు మరోమారు జలమయం
హైదరాబాద్(జనంసాక్షి): హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం దంచి కొట్టింది. ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం మారిపోయింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడిరది. యూసుఫ్‌గూడలో ఓ గల్లీలో రిపేర్ సెంటర్‌లోని వాషింగ్ మిషన్ నీటిలో కొట్టుకుపోయింది. దాన్ని ఆపేందుకు ఆ వ్యక్తి చాలా ప్రయత్నించాడు. వాటర్‌లో అది కొట్టుకుపోతుండగా.. పట్టుకునేందుకు శ్రమించినా.. ఫలితం దక్కలేదు. నీటి ప్రవాహం చాలా వేగంగా రావడంతో... ఆ వాషింగ్ మిషన్ నీటిలో కొట్టుకుపోయింది. మరోవైపు పంజాగుట్టలో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు కి.విూటర్ల మేర నిలిచిపోయాయి. అందులో అంబులెన్స్ సైతం ఉండిపోయింది. ఒక్కసారిగా భారీ వర్షంతో హైదరాబాద్ నగరం అతలకుతలం అయింది. వాహనదారులు, ప్రయాణికులు, నగరవాసులు అందరూ... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని వర్షం వీడడం లేదు. మళ్లీ దంచికొడుతుండడంతో గ్రేటర్ వాసులు విలవిల్లాడుతున్నారు. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, సరూర్‌నగర్, కూకట్‌పల్లి, గాజులరామారం, నిజాంపేట్, చింతల్, జీడిమెట్ల, నాంపల్లి, మణికొండ, షేక్‌పేట్‌లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకోవడంతో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ భావించింది. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ కనిపించింది. ఆ తర్వాత 4 గంటల నుంచి భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్య ఏర్పడిరది. ఉద్యోగులు ఇంటికి వెళ్తున సమయంలో వర్షం పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి రోడ్లపై నరకయాతన అనుభవిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే తెలంగాణను వర్షాలుముంచెత్తాయి. రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మూసీనది పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నదిని ఆనుకుని ఉన్న కాలనీల లోని ఇళ్లలోని నీరు ప్రవేశించాయి. హైదరాబాద్ మహానగరాన్ని వర్షం వీడేలా కనిపించడం లేదు. నిన్న, మొన్న కాస్త వెల్లడిరచినా.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం నుంచి ముసురు కమ్మేసింది. కాసేపటికే వర్షం కురవడంతో రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నేరేడ్‌మెట్‌లో 7.3 సెంటీవిూటర్లు, మల్కాజ్‌గిరిలో 5.1, బాల్‌నగర్‌లో 5, అల్వాల్‌లో 4.8సె.విూ. వర్షపాతం నమోదైంది. మరో గంట పాటు హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ (ఉఊఓఅ అనీపపతిబబతినీని।స) డిజాస్టర్ బృందాలను అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.
6.అనకాపల్లిలో ఘోరం
` పూడిమడక బీచ్‌లో ఏడుగురు విద్యార్థులు గల్లంతు
అనకాపల్లి ్ల(జనంసాక్షి): అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్‌లో ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అనకాపల్లి డైట్ కాలేజీ నుంచి బీచ్‌కు 15 మంది విద్యార్థులు వెళ్లారు. వారిలో ఏడుగురు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన వారిని జగదీష్, యశ్వంత్, సతీష్, గణేష్, చందుగా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థుల గల్లంతుపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
7.కల్తీ మద్యం, డ్రగ్స్ మాఫియాలను రక్షిస్తున్నదెవరు..?
` బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డ రాహుల్ గాంధీ
దిల్లీ(జనంసాక్షి): గుజరాత్‌లో కల్తీ మద్యం కారణంగా 42మంది పేదలు ప్రాణాలు కోల్పోగా..అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతల అండదండలతోనే రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వీటిపై వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాని డిమాండ్ చేసింది. మరోవైపు రాష్ట్రంలో కల్తీ మద్యం, డ్రగ్స్ మాఫియాలకు ఎవరు రక్షణ కల్పిస్తున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రమాదకరమైన రసాయనాల వినియోగంపై అత్యంత పర్యవేక్షణ కొనసాగించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడం ఎన్నో ప్రశ్నలకు తావిస్తోందని కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఇక ఇదే అంశంపై మాట్లాడిన రాహుల్ గాంధీ.. ‘ సంపూర్ణ మద్యనిషేధం అమలులో ఉన్న గుజరాత్‌లో కల్తీ మద్యం సేవించడం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ కూడా పట్టుబడుతూనే ఉన్నాయి. బాపూ (మహాత్మా గాంధీ), సర్దార్ పటేల్‌లు జన్మించిన నేలపై ఇలా జరగడం అత్యంత ఆందోళనకరమైన విషయం. విచక్షణారహితంగా మత్తు వ్యాపారం చేస్తోన్న ఈ వ్యక్తులు ఎవరు..? అధికారంలో ఎవరు ఈ మాఫియాలకు రక్షణ కల్పిస్తున్నారు..? అని ప్రశ్నించారు.గుజరాత్‌లోని బోతాద్‌తోపాటు అహ్మదాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ మద్యం సేవించి వందకు పైగా బాధితులు ఆస్పత్రుల్లో చేరిన సంగతి తెలిసిందే. వారిలో ఇప్పటికే 42 మంది మృత్యువాతపడగా.. మరో 97 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఇలా రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. గుజరాత్ పర్యటన నేపథ్యంలో బాధిత కుటుంబాలను ప్రధాని మోదీ పరామర్శించాలని కోరింది.
10.ఈ ఎగిరే శవపేటికను ఇంకెప్పుడు వదిలించుకుంటారు..?
` భాజపా ఎంపీ వరుణ్ గాంధీ ఫైర్
దిల్లీ(జనంసాక్షి): భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఇద్దరు పైలట్లను మిగ్`21 బలితీసుకుంది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ కాలం చెల్లిన విమానాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని విరమించుకోవాలని డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ ప్రమాదాల్లో భారత్ విమానాలను నష్టపోవడంతోపాటు అత్యంత విలువైన ఫైటర్ పైలట్లను కూడా కోల్పోతోంది. కాగా, తాజా దుర్ఘటనపై భాజపా ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఎగిరే శవ పేటికలను ఇంకెప్పుడు మన వైమానిక దళం నుంచి తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.’నిన్న రాజస్థాన్‌లోని బాడ్‌మేడ్‌లో జరిగిన ప్రమాదం ప్రతి ఒక్కరినిగ్భ్భ్రాంతికి గురిచేసింది. గత కొద్ది సంవత్సరాలుగా మిగ్`21 విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విమానం ఇప్పటివరకూ 200 మంది పైలట్ల ప్రాణాలను బలితీసుకుంది. ఇంకెప్పుడు ఈ ఎగిరే శవపేటికను వైమానిక దళం నుంచి పక్కనపెడతారు..? మన పిల్లలు ఈ విమానాలు నడిపేందుకు అనుమతిస్తామా అని ఈ దేశ పార్లమెంట్ సభ్యులు ఆలోచించుకోవాలి’ అంటూ గట్టిగా ప్రశ్నించారు.నిన్న జరిగిన ప్రమాదంలో వింగ్ కమాండర్ ఎం రాణా, ఫ్లైట్ లెఫ్టినెంట్ అద్వితీయ భల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. భారత వైమానిక దళం ఈ సెప్టెంబర్ చివరి నాటికి మిగ్`21 విమానాల సేవలను నిలిపివేయాలనుకుటోంది. దాంతో మిగ్ 21 బైసన్ స్క్వాడ్రన్‌లో మూడు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇవి కూడా ప్రతి ఏడాదికి ఒకటి చొప్పున రిటైర్ అవుతూ 2025 నాటికి పూర్తిగా వైమానిక దళాన్ని వీడనున్నాయని తెలుస్తోంది.
12.మంకీపాక్స్ లక్షణాల్లో మార్పు..
అమెరికా, ఐరోపాను వణికిస్తోన్న వైరస్
జెనీవా(జనంసాక్షి):కరోనాతో ఉక్కిరిబిక్కిరై ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ప్రపంచాన్ని మంకీపాక్స్(ఓనీనిసవవజూనీలీ) కలవరానికి గురిచేస్తోంది.ఇప్పటికే ఈ వైరస్ 78 దేశాలకు వ్యాపించగా.. 18 వేలమంది దీని బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(చిఊూ)వెల్లడిరచింది. ఐరోపా, అమెరికా దేశాలపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ వెలుగుచూసిన కేసుల్లో 95 శాతం ఈ రెండు ప్రాంతాల నుంచే వచ్చాయని విూడియాకు తెలిపారు. 70 శాతానికి పైగా కేసులు ఐరోపా నుంచి, 25 శాతం కేసులు అమెరికా ప్రాంతం నుంచి బయటపడ్డాయని పేర్కొన్నారు. అలాగే.. ప్రస్తుత వ్యాప్తిలో లక్షణాల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనమొకటి తెలిపింది.ఈ ఏడాది మేలో మంకీపాక్స్ వ్యాప్తి పెరిగినప్పటి నుంచి ఇప్పటివరకు గుర్తించిన మొత్తం కేసుల్లో 98 శాతం.. స్వలింగ సంపర్క పురుషుల్లోనే ఉన్నాయని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే స్త్రీ`పురుషులిద్దరితోనూ శృంగారంలో పాల్గొనే మగవారిలోనే ఈ కేసులు వెలుగుచూశాయని చెప్పారు. ఇటీవల మాట్లాడుతూ.. ఈ వ్యాధి బారిన పడే ముప్పును తగ్గించుకునేందుకుగాను ముఖ్యంగా పురుషులు శృంగార భాగస్వాముల సంఖ్యను తగ్గించుకోవాలని సూచించారు. తాజాగా ఈ వ్యాధి గురించి తప్పుడు సమాచారంపై హెచ్చరించారు. ‘ఆన్‌లైన్ వేదికగా కొవిడ్`19 గురించి ఏ స్థాయిలో తప్పుడు సమాచారం జరిగిందో చూశాం. ఈ మంకీపాక్స్ విజృంభణ సమయంలో అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా సోషల్ విూడియా, వార్తా సంస్థలు, టెక్ సంస్థలు మాతో కలిసి పనిచేయాలని కోరతాం. సామాజిక వివక్ష.. వైరస్ కంటే ప్రమాదకరమైంది. ఇది వ్యాప్తికి ఆజ్యం పోస్తుంది’ అని హెచ్చరించారు.పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుండటంతో ఇటీవల ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా (ణశ్రీనీపజీశ్రీ ష్ట్రవజీశ్రీబిష్ట్ర వఎవతీణవనిఞవ) ప్రకటించింది. ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (పీహెచ్‌ఈఐసీ)’నే అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిగా పిలుస్తారు. ఓ దేశ సరిహద్దును దాటి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాధులు విస్తరిస్తూ ప్రజా ఆరోగ్యానికి ఆందోళనగా మారిన అసాధారణ పరిస్థితుల్లో దీనిని ప్రకటిస్తారు. తద్వారా.. అంతర్జాతీయ దేశాలన్నీ సమన్వయంగా స్పందిస్తూ వ్యాధిపై పోరాడాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిస్తుంది.
లక్షణాల్లో తేడాలొచ్చాయి..!
మంకీపాక్స్ గత విజృంభణలతో పోలిస్తే.. ప్రస్తుత ఉద్ధృతిలో కనిపిస్తోన్న లక్షణాల్లో తేడా ఉన్నట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్(బీఎంజే)లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలిన 197 మంది పురుషులపై పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఆ 197 మందిలో 196 మంది స్వలింగ సంపర్కులే. 2007`11 (డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో), 2017`18(నైజీరియా)లో సంభవించిన వ్యాప్తితో పోల్చిచూడగా.. పురుషాంగం వాపు, మలద్వారం వద్ద నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు తేలింది. ఈ లక్షణాలు కనిపిస్తోన్న బాధితులపై సవిూక్షను కొనసాగించాలని అధ్యయనకర్తలు సూచించారు. అలాగే లక్షణ రహిత, స్వల్పస్థాయి లక్షణాలు కలిగిన వ్యక్తుల నుంచి ఈ వైరస్ సోకుంతుందని, అయితే అది స్వల్పస్థాయిలోనేనని పేర్కొన్నారు.
13.బైడెన్.. నిప్పుతో చెలగాటమొద్దు..!
` హెచ్చరించిన షీ జిన్‌పింగ్..
` దీటుగా స్పందించిన అమెరికా అధినేత
న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా`చైనా అధినేతల మధ్య మాటల తూటాలు పేలాయి. పరస్పరం ఘాటు హెచ్చరికలు జారీ చేసుకొన్నారు. గురువారం బైడెన్`జిన్‌పింగ్ మధ్య రెండున్నర గంటల సమావేశం సెగలు పుట్టించింది. ఇరు దేశాల మధ్య విభేదాలను ఈ భేటీ మరోసారి తేటతెల్లం చేసింది. ఇరువురు నేతలు ముఖాముఖీ భేటీ కావడానికి సానుకూలత వ్యక్తం చేయడం ఒక్కటే చెప్పుకోదగ్గ పరిణామం. తెరవెనుక అమెరికా ఏదో అనుమానిస్తోంది.. అందుకే ఇటీవల ఆ దేశం తీసుకొన్న నిర్ణయాలు చాలా వరకూ చైనాను దృష్టిలో పెట్టుకొనే ఉంటున్నాయి.
తైవాన్ విషయంలో తగ్గేదేలే..
అమెరికా`చైనా అధ్యక్షుల చర్చల్లో తైవాన్ ప్రధానాంశంగా మారింది. త్వరలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైపే సందర్శించనుందనే వార్తలను దృష్టిలో పెట్టుకొని షీ జిన్‌పింగ్ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ‘’ప్రజాభిప్రాయాన్ని ఉల్లంఘించకూడదు. ఒక వేళ విూరు నిప్పుతో చెలగాటం ఆడితో విూకే కాలుతుంది. అమెరికా ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా’’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించినట్లు చైనా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు అమెరికా ఇంత కఠినంగా కాకపోయినా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ‘’తైవాన్ విషయంలో అమెరికా పాలసీ మారలేదన్న విషయాన్ని బైడెన్ గుర్తు చేశారు. కానీ, ఏకపక్షంగా ప్రస్తుత పరిస్థితిని మార్చే యత్నం చేస్తే తైవాన్ జలసంధిలో శాంతి స్థిరత్వం కొరవడుతుంది’’ అని పేర్కొన్నట్లు అమెరికా వర్గాలు వెల్లడిరచాయి. వీరి మధ్య ఆర్థిక సహకారం, ఉక్రెయిన్ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి.
అదే ఫైర్..
నిప్పుతో చెలగాటం.. కామెంట్లు చేయడం చైనా అధ్యక్షుడు షీజిన్ పింగ్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలానే మాట్లాడారు. చైనాకు చెందిన దౌత్యవేత్తలు కూడా తైవాన్ విషయంలో ఇదే వాక్యాన్ని తరచూ వాడుతుంటారు. ఇప్పుడు జిన్ పింగ్ వ్యాఖ్యలు దానికి మరింత ప్రాధాన్యం తెచ్చాయి.
వరుస నిర్ణయాలతో అమెరికా అప్రమత్తం..
నాన్సీ పెలోసీ తైపేలో పర్యటిస్తారనే వార్తలు గుప్పుమనడంతో అమెరికా అప్రమత్తమైంది. చైనాతో పరిస్థితి ఎలా ఉంటుందోనని భావించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మరో వైపు పెలోసీ అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ.. చైనా హెచ్చరికల విూద హెచ్చరికలు జారీ చేస్తోంది. అమెరికా`చైనా మధ్య ఇది ప్రధాన వివాదంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకల మోహరింపు: పెలోసీ పర్యటనను దృష్టిలో పెట్టుకొని అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్‌ఎస్ రోనాల్డ్ రీగన్, స్ట్రైక్ గ్రూప్‌ను సింగపూర్ పోర్టు నుంచి దక్షిణ చైనా సముద్రంలోకి తరలించింది. అమెరికా నేవీ సెవన్త్ ఫ్లీట్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.చైనా ప్రభుత్వ గూఢచర్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అమెరికా అధికారులు హెచ్చరించారు. అణ్వాయుధాలకు సంబంధించిన కమ్యూనికేషన్లపై డ్రాగన్ దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు.సెవిూ కండెక్టర్ల తయారీ స్థిరీకరించడంపై: అమెరికాలో టెక్ సెక్టార్ పూర్తిగా స్వతంత్రంగా పనిచేసేలా సెవిూకండెక్టర్ల ఉత్పత్తిని స్థిరీకరించాలన్న బిల్లుపై ప్రతినిధుల సభలో ఇరు పక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. చైనా తయారీని నిలిపివేసినా, తైవాన్ ఎగమతులను అడ్డుకొన్నా ఇబ్బంది లేకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.
14.గూడూరు ఆశ్రమ పాఠశాలలో పుఢ్ పాయిజన్
36మంది విద్యార్థులకు అస్వస్థత
మహబూబాబాద్(జనంసాక్షి):బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటన మరవకముందే మహబూబాబాద్ జిల్లాలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. గూడూరులోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 36 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. విద్యార్థులను వెంటనే మహబూబాబాద్ ఏరియా హస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వానపాము పడ్డ పప్పు, కిచిడి తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వార్డెన్‌పై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ రావాలంటూ ఆందోళన చేపట్టారు. గూడూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారులు స్పందించారు. వాª`డ్గంªన్ స్వామిని సస్పెండ్ చేస్తూ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎర్రయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్, విధుల్లో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకున్నారు.
all news